Amit Shah: ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలేవి..? కాంగ్రెస్‌పై అమిత్ షా ప్రశ్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో లోక్‌సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలను అవమానిస్తే బీజేపీ సహించదని అన్నారు. కాగా.. ఈ ఘటనలో ఎన్‌డిఎ మిత్రపక్ష అభ్యర్థి ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉందని అమిత్ షా ప్రశ్నించారు.
కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అమిత్ షా ప్రశ్నించారు. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని ఆయన తెలిపారు. మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్‌లు గత కొద్ది రోజులుగా హాసన్‌లో మారుమోగుతున్నాయి. కాగా.. ఏప్రిల్ 26న పోలింగ్ జరిగిన హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ-జేడీ(ఎస్) కూటమి అభ్యర్థి రేవణ్ణ (33) పోటీ చేశారు.
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
ఈ ఘటనపై ప్రియాంక గాంధీ తమను ప్రశ్నిస్తున్నారని.. అయితే ప్రధాని నరేంద్ర మోడీని లేదా తనను అడగడానికి ముందుగా, ఆమె తన పార్టీ ముఖ్యమంత్రిని అడగాలని షా అన్నారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తోంది? ఎందుకు విచారణ లేదు? తాము విచారణకు అనుకూలమని, రేవణ్ణపై చర్యలు తీసుకుంటామని జేడీ(ఎస్) కూడా ప్రకటించిందని తెలిపారు. కాగా.. అంతకుముందు రోజు రేవణ్ణను జేడీ(ఎస్) పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రేవణ్ణ గురించి మీడియాలో వచ్చిన విషయం చాలా బాధాకరమని, ఏ విధంగానూ సహించలేమని షా అన్నారు. బీజేపీ స్టాండ్ చాలా స్పష్టంగా ఉందని.. మహిళా సాధికారతకి అవమానాన్ని తాము సహించమని అమిత్ షా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
-
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?