మహారాష్ట్రకు సంబంధించి బీజేపీ తీర్మానం లేఖను హోంమంత్రి అమిత్ షా ఆదివారం విడుదల చేశారు. దీని తర్వాత.. తన ప్రసంగంలో అమిత్ షా ముఖ్యమంత్రి పదవికి సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అని, అయితే ఎన్నికల తర్వాత అందరం కూర్చుని దీనిపై చర్చిస్తామని అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా శరద్ పవార్‌ను కూడా టార్గెట్ చేశారు. ఈసారి ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం శరద్ పవార్‌కు ఇవ్వబోమని అన్నారు. శరద్ పవార్‌కు తప్పుడు కథనాలు చెప్పడం అలవాటుగా మారిందని విమర్శించారు. కానీ ఈసారి ఆయన కథలు పని చేయవన్నారు.
READ MORE: Mexico : మెక్సికన్ బార్‌లో విచక్షణారహితంగా కాల్పులు..10 మంది మృతి
శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ను ఉద్దేశిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. బాలాసాహెబ్, సావర్కర్‌ను అవమానించిన వారి పక్షానే ఆయన ఉన్నారంటూ మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో భాజపా మ్యానిఫెస్టోను అమిత్ షా విడుదల చేసి మాట్లాడారు. మహా వికాస్ అఘాడీలో భాగమైన శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ)లపై ప్రజలకు నమ్మకం లేదని అమిత్ షా విమర్శించారు. ‘‘ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదు. బాలాసాహెబ్, సావర్కర్‌లను అవమానించిన కాంగ్రెస్ పక్షానే ఉద్ధవ్ ఠాక్రే నిలబడ్డారు’’ అంటూ విమర్శలు గుప్పించారు.
READ MORE: Pawan Kalyan: మాది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదు: డిప్యూటీ సీఎం పవన్
కాగా.. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో మహాయుతి కూటమి ప్రయత్నిస్తోంది. మరోవైపు.. ఈసారి అధికారంలోకి రావాలని ఎంవీఏ విశ్వప్రయత్నాలు చేస్తోంది.