Site icon NTV Telugu

Amit Shah: నేడు జమ్ముకాశ్మీర్ లో అమిత్ షా పర్యటన..!

Amit Shah

Amit Shah

జమ్ముకాశ్మీర్‌లో జరుగుతున్న ఎన్నికల కార్యకలాపాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు (గురువారం) పరిశీలించనున్నారు. బారాముల్లా, అనంత్‌నాగ్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే కాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు వివిధ సామాజిక, వ్యాపార, మత సంస్థల ప్రతినిధులను కలిసేందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితికి అవకాశం ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

Read Also: Lokshabha Elections 2024: నేడు యూపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..!

అయితే, నేటి సాయంత్రం 6 గంటలకు అమిత్ షా శ్రీనగర్‌కు చేరుకుంటారని రాష్ట్ర పరిపాలన సీనియర్ అధికారి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి తిరిగి వెళ్లే ముందు ఆయన కాశ్మీర్‌లోని వివిధ ప్రజా ప్రతినిధులతో సమావేశమై క్షేత్ర పరిస్థితిని సమీక్షిస్తారని తెలిపారు. భద్రతా సమీక్ష సమావేశంలో పాల్గొనవచ్చు, అయితే ఈ సమావేశం ఇంకా ఖరారు కాలేదని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ తెలిపారు.

Read Also: TG Cabinet Meeting : ఈనెల 18న తెలంగాణ కేబినెట్‌ సమావేశం

కొన్ని యువజన సంఘాలతో పాటు పౌర సంఘాల ప్రతినిధులు కూడా హోంమంత్రితో సమావేశం కానున్నారు. అమిత్ షా పర్యటన బారాముల్లా, అనంత్‌నాగ్ పార్లమెంటరీ నియోజకవర్గాలతో ముడిపడి ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. శ్రీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని చాలా చోట్ల, పీపుల్స్ కాన్ఫరెన్స్ కార్యకర్తలు జమ్మూ కాశ్మీర్‌లో తమ పార్టీకి మద్దతు ఇవ్వలేదన్నారు. బారాముల్లా, అనంత్‌నాగ్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

Exit mobile version