Site icon NTV Telugu

Amit Shah : కేసీఆర్ 10ఏళ్లలో కేటీఆర్‌ని సీఎం చేయాలనే ఆలోచనలోనే గడిపేశారు

Amith Shah

Amith Shah

ఆదిలాబాద్‌లో బీజేపీ జనగర్జన సభ నిర్వహించింది. ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. తెలంగాణ ఓకే ఒకే భూమి ఆంగ్లేయులు, నిజంపై పోరాటం చేసిందన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికారికంలోకి రాగానే 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని, తెలంగాణకి డబల్ ఇంజన్ సర్కార్ కావాలన్నారు అమిత్‌ షా. కేంద్ర ట్రైబల్ యూనివర్సిటీ ఆలస్యానికి రాష్ట్రం నిధులు కేటాయించక పోవడమే కారణమని, పసుపుబోర్డు ద్వారా ఎగుమతులు పెరగనున్నాయన్నారు. కృష్ణ ట్రిబ్యునల్ ద్వారా మోడీ తెలంగాణ ప్రజల నీటి సమస్యను తీర్చారని, 33శాతం మహిళా రిజర్వేషన్లు చేసిన ఘనత మోడీదన్నారు అమిత్‌ షా.

Also Read : Avocado Cultivation : అవకాడో సాగులో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

అంతేకాకుండా..’10 ఏళ్లలో కేసీఆర్ రైతులు, దళితులు, ఆదివాసీలు, పేదల కోసం ఎం చేయలేదు. కేసీఆర్ 10ఏళ్లలో కేటీఆర్ ని సీఎం చేయాలనే ఆలోచనలోనే గడిపేశారు. పేదలు వెనకబడిన వర్గాల అభివృధ్ధి కోసమే మోడీ పాటు పడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళైనా ఆదివాసీ రాష్ట్రపతి కాలేదు, ఒక పేద మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీది. ఎన్నికలు రాగానే కొట్టబట్టలు వేసుకొని కాంగ్రెస్ నేతలు వస్తారు. కాంగ్రెస్ 24వేల కోట్ల బడ్జెట్ ఆదివాసీలకు కేటాయిస్తే.. మోడీ ప్రభుత్వం లక్ష 24వేల కోట్లు కేటాయించింది. 12లక్షల కోట్ల కుంభకోణం యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగింది. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదు. కశ్మీర్ లో ఆర్టికల్ 370ను ఎత్తేసి దేశంలో అంతర్భాగం చేసిన ఘనత మోడీది.

Also Read : Chandrababu: చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మిణి, పయ్యావుల కేశవ్ ములాఖత్

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి అయోధ్య రామ మందిరం అంశాన్ని కాంగ్రెస్ నాన్చుతూ వచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో భవ్య రామమందిరాన్ని పారంభిస్తాం. సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్తాన్ లోకి చొరబడి సరిహద్దును బలోపేతం చేసింది. రైతుల ఆత్మహత్యలు, అవినీతి, నిరుద్యోగం తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉంది. కేసీఆర్ కార్ స్టీరింగ్ ఒవైసీ దగ్గర ఉంది. ఎంఐఎం అడుగుజాడల్లో నడిచే బి.ఆర్.ఎస్ ను కూకటి వేళ్ళతో పెకిలించాలి. దళితులకు 3 ఎకరాలు, దళితబంధు ఏమైంది కేసీఆర్. కరోనా కష్టకాలంలో ఉచితంగా రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోడీది. జీ20 సదస్సులో ప్రధాని మోదీని ప్రశంసించారు. తెలంగాణ ప్రజల ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉంది.’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

Exit mobile version