Amit Mishra: స్టార్ క్రికెటర్ డార్క్ సైడ్ బయటపెట్టిన భార్య!
- మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాపై వరకట్న వేధింపుల కేసు పెట్టిన భార్య గరిమా
- ప్రేమ పెళ్లి చేసుకున్న జంట
- పెళ్లైన కొద్ది రోజుల నుంచే వేధింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Mishra: టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్, ఐపీఎల్ స్టార్ అమిత్ మిశ్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఆయన భార్య గరిమా తివారీ కాన్పూర్ కోర్టును ఆశ్రయించడం క్రీడా వర్గాల్లో కలకలం రేపుతోంది. మోడల్‌గా పనిచేసిన గరిమాకు 2019లో అమిత్ మిశ్రాతో పరిచయం ఏర్పడింది. రెండేళ్ల ప్రేమ తర్వాత వీరిద్దరూ 2021 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన కొద్దిరోజుల నుంచే అమిత్ కుటుంబ సభ్యులు తనను వేధించడం మొదలుపెట్టారని గరిమా ఆరోపించారు.
READ ALSO: Nabha Natesh : నభా అందాల వేడికి వడదెబ్బ తగిలేలా ఉందిగా
Also Read
- 13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
- Donald Trump: చమురు ధరలపై ట్రంప్ సంచలన ప్రకటన.. 2 డాలర్ల దిగువకు..!
- 7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
- BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..
అమిత్ కుటుంబం తనను కారుతో పాటు రూ.10 లక్షల నగదు తీసుకురావాలని ఒత్తిడి చేశారని ఆమె పేర్కొన్నారు. అమిత్ తరచూ మద్యం తాగి వచ్చి తనను కొట్టేవాడని, కొన్నిసార్లు రోజుల తరబడి ఆహారం పెట్టకుండా గదిలో బంధించి వేధించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి తట్టుకోలేక గతంలో ఒకసారి తాను ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని గరిమా వెల్లడించారు. ఈ వేధింపులపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, అందుకే న్యాయం కోసం నేరుగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె మీడియాకు తెలిపారు.
అమిత్ మిశ్రా కెరీర్..
42 ఏళ్ల అమిత్ మిశ్రా గతేడాది సెప్టెంబరులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. భారత్ తరపున 22 టెస్టులు (76 వికెట్లు), 36 వన్డేలు (64 వికెట్లు) ఆడారు. ఐపీఎల్లో మూడు సార్లు హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్‌గా అమిత్ మిశ్రా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.
READ ALSO: Vizag Hotels: విశాఖ హోటల్స్‌కు తాకిన యుద్ధ ప్రభావం.. మరో రెండు రోజుల్లో అన్నీ క్లోజ్!
తాజావార్తలు
-
The Paradise : ‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ టెన్షన్.. రిలీజ్‌కు కేవలం 14 రోజులు మాత్రమే
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎలా ఆడాలో ఇషాన్ కిషన్‌ను చూసి నేర్చుకో!
-
Donald Trump: చమురు ధరలపై ట్రంప్ సంచలన ప్రకటన.. 2 డాలర్ల దిగువకు..!
ట్రెండింగ్
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!