Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తున్నాయి.ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచేసింది.ఈ చిత్రంలో స్పెషల్ క్యారెక్టర్ అయినా బుజ్జి పాత్రను మేకర్స్ ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయం చేసారు.
Read Also :Vettaiyan : దేవరకు పోటీగా వస్తున్న వెట్టయాన్..?
ఈ సినిమాలో బుజ్జి అంటే ప్రభాస్ ఫ్రెండ్ అయిన రోబోటిక్ కార్.. బుజ్జికి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా బుజ్జి కారును దేశంలో పలు ప్రధాన నగరాల్లో తిప్పుతూ కల్కి మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ పై మేకర్స్ నేడు స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నారు.అలాగే ఈ సినిమా అడ్వాన్సు బుకింగ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.ఈ సినిమా అడ్వాన్సు బుకింగ్ ఈ నెల 7 నుండి మొదలు కానుంది.ఇప్పటికే విదేశాల్లో ఈ సినిమాకి సంబంధించిన టికెట్ బుకింగ్ మొదలైంది.అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.ఇందులో భాగంగా ఈ సినిమా రన్ టైం రివీల్ అయినట్లు సమాచారం.ఈ సినిమాను మేకర్స్ 2 గంటల 49 నిముషాలుగా మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.ఈ సినిమాకు వచ్చిన ప్రేక్షకులు మరో కొత్తలోకం లోకి వచ్చినట్లు ఫీల్ అవుతారని మేకర్స్ తెలిపారు.