Dhanush: ధనుష్ పై నిషేధం ఎత్తివేత..
- ధనుష్ పై నిషేధం ఎత్తివేత..
- ఆనందంలో అభిమానులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush: తమిళ చిత్రసీమలో అగ్ర హీరోలలో ఒకరిగా ఉన్న ధనుష్.. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించాడు. తాజాగా ధనుష్ యొక్క 50వ చిత్రం, స్వయంగా దర్శకత్వం వహించి నటించిన రాయన్ గత జూలైలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లతో సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ధనుష్ ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ డబ్బులు తీసుకుని వారి సినిమాల్లో నటించకుండా అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న ఫిర్యాదు వచ్చింది. దీంతో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ధనుష్‌పై నిషేధం విధించింది. దీంతో ధనుష్‌ని తమ సినిమాల్లో కమిట్ చేసే ముందు నిర్మాతల సంఘంతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే తను ఇప్పటికే కమిట్ అయిన సినిమాలతో పాటు తను దర్శకత్వం వహిస్తున్న ‘నిలుకు ఎన్ మేల్ ఎన్నడి గోబం’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.
Malaika Arora: ఆత్మహత్య చేసుకునేముందు.. మలైకా అరోరాకు ఫోన్ చేసిన ఆమె తండ్రి!
Also Read
- 12,000 నిట్స్ బ్రైట్నెస్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. డిసెంబర్ 9న Motorola Signature 27 లాంచ్..!
- Uttar Pradesh: పొరపాటున ఒవైసీకి గౌరవ వందనం.. సీవోపై బదిలీ వేటు..!
- Astrology: నవంబర్ 24 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారు.. ఈ పరిహారం చెల్లించండి..!
- Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
తనపై విధించిన నిషేధానికి సంబంధించి ధనుష్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. సమాచారం ప్రకారం, ధనుష్ 2 షరతులకు అంగీకరించాడు. అవి ప్రముఖ నిర్మాణ సంస్థ తేనాండాల్ ఫిల్మ్స్ నిర్మించే చిత్రంలో నటించడం కాగా.. మరొకటి ఫైవ్ స్టార్ క్రియేషన్స్ నుండి వచ్చిన అడ్వాన్స్ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించడం. ఈ రెండు షరతుల నేపథ్యంలో ధనుష్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్మాతల సంఘం నిర్ణయించింది. అంతకుముందు, గత జూలైలో తమిళ చిత్ర నిర్మాతల సంఘం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ధనుష్ అనేక మంది నిర్మాతల నుండి అడ్వాన్స్‌లు అందుకున్న దృష్ట్యా, నిర్మాతలు ఏదైనా కొత్త చిత్రాలను ప్రారంభించే ముందు తమిళ చిత్ర నిర్మాతల సంఘాన్ని సంప్రదించవలసిందిగా అభ్యర్థించబడింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
12,000 నిట్స్ బ్రైట్నెస్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. డిసెంబర్ 9న Motorola Signature 27 లాంచ్..!
-
Shubman Gill: శుభ్‌మన్ గిల్ నువ్ ఓ కెప్టెన్.. మైదానంలోనే అలా చేయడం సరికాదు!
-
Uttar Pradesh: పొరపాటున ఒవైసీకి గౌరవ వందనం.. సీవోపై బదిలీ వేటు..!
-
NVIDIA CEO Jensen Huang: ఈసారి మంచి సీఈఓగా ఉంటా.. కౌగిలించుకున్న మహిళా ఉద్యోగి.. భావోద్వేగానికి గురైన జెన్సన్ హువాంగ్!
-
Astrology: నవంబర్ 24 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారు.. ఈ పరిహారం చెల్లించండి..!
ట్రెండింగ్
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!