Site icon NTV Telugu

Vikarabad: అంబేద్కర్ విగ్రహం ధ్వంసం.. పెద్ద ఎత్తున ఆందోళన..

Ambedkar

Ambedkar

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని మధ్యాహ్నం గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE: Hyderabad: రిటైర్డు ఉద్యోగికి మాయమాటలు చెప్పి రూ. 74.36 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు.. కట్‌చేస్తే..

మరోవైపు.. ఈ అంశంపై గ్రామస్థులు, వివిధ సంఘాల నేతలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పుట్టాపహడ్ చౌరస్తా మహబూబ్‌ నగర్ పరిగి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ చేసిన సేవను కొనియాడుతూ.. నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు.

READ MORE: Reza Shah Pahlavi: ఖమేనీ రాజీనామా చేయాలి.. మళ్ళీ గర్జించిన ఇరాన్ మాజీ యువరాజు

Exit mobile version