వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. అంబటి మాట్లాడుతూ.. 2019లో 23 సీట్లు ఓటు షేర్ కంటే 2024లో. 2.5 శాతం జగన్ కు అత్యధికంగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. ఈసారి ఎన్నికలు జరిగితే కూటమి ఓడిపోతుందని చంద్రబాబుకు అర్థం అయిపోయింది.. సింగపూర్ లో ఇన్వెస్టర్లకు అర్థమైంది.. చంద్రబాబు భయంతో ఆరోపణలు చేస్తున్నారు.. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి పడిపోయిందంటే కారణం చంద్రబాబే.. చంద్రబాబు దుర్మార్గం కారణంగానే పోలవరం ప్రాజెక్టు జాప్యానికి కారణం అని తెలిపాడు.
Also Read:Nellore : ఇళ్లు స్థలాలు ఇప్పిస్తానంటూ 21 కుటుంబాల నుంచి రూ.10వేల చొప్పున కాజేసిన లేడి డాన్ అరుణ
జాతీయ ప్రాజెక్టును చంద్రబాబు చేపట్టడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. కమిషన్లకు కక్కుర్తి పడి చంద్రబాబు ప్రాజెక్టు చేపట్టారు.. కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టారు.. డయాఢ్రం వాల్ దెబ్బ తినడానికి కారణం ఇదే.. ఈ నెపాన్ని జగన్ పై నెట్టడానికి చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని ప్రజలకు అర్థమైంది.. కట్టుకథలు చెప్పి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు..
Also Read:Alliance Airlines: అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం.. మూడు సార్లు రన్‌వేపైకి వెళ్లి..!
కేవలం 15 నెలల కాలంలోనే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడనే సంకేతాల వచ్చాయి.. ఇప్పటికైనా తీరు మార్చుకొని సక్రమ పరిపాలన చేయాలి అని సూచించాడు. సూపర్ సిక్స్ ఏ విధంగా సక్సెస్ అయిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి.. ఉచిత బస్సులో తిరుపతి, శ్రీశైలం, అన్నవరం వెళ్ళవచ్చని చెప్పిన చంద్రబాబు.. డైరెక్ట్ గా ఎలాగ వెళ్లవచ్చో సమాధానం చెప్పాలి అని ప్రశ్నించాడు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని నిర్ధారణ అయిందని తెలిపాడు. నిన్న పెద్దాపురం వేదికగా సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్.. సూపర్ సక్సెస్ అన్నారు.. అరకొరగా అమలు చేస్తున్న సూపర్ సిక్స్ ఎలా సక్సెస్ అయ్యిందో చంద్రబాబు చెప్పాలి.. 14 నెలలకే సీఎంగా చంద్రబాబు ఆత్మవిశ్వాసం కోల్పోయారు అని వెల్లడించాడు.
