Site icon NTV Telugu

Ambati Rambabu: ఈ ప్రభుత్వాన్ని ఓడించే శక్తి ఎవరికీ లేదు

Minister Ambati Rambabu

Minister Ambati Rambabu

పల్నాడు మంత్రి ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.పుట్టింది రేపల్లె అయినా, చచ్చేది మాత్రం సత్తెనపల్లెలోనే అన్నారు అంబటి. సతైనపల్లి ప్రజలు నాకు అపారమైన గౌరవం ఇచ్చారు. నేను మీలో ఒకడినీ, మీతోనే ఉంటా..కాపులకు పట్టిన శని పవన్ కళ్యాణ్ అని మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వేడి రాజేశారు. పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీ వేలంపాటలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న పార్టీ అన్నారు. బిఆర్ఎస్ వాళ్లు పాడు కుంటారో టిడిపి వారు పాడుకుంటారో భారతీయ జనతా పార్టీ పాడుకుంటారో , ఎవరు ఎక్కువగా ధర పెడితే వారికి అమ్ముడుపోయేటువంటి పార్టీ జనసేన పార్టీ అన్నారు అంబటి.

Read Also:Pan India Drama: ఎన్టీఆర్-వెట్రిమారన్-ధనుష్

2024 లో జరిగే ఎన్నికలపై వైసీపీ నేతలు ధీమాతో ఉన్నారు. అర్హత ఉంటే పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఓడించే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు.

Read Also: Shraddha Walkar Case: అఫ్తాబ్ శిక్షణ పొందిన చెఫ్.. మాంసాన్ని ఎలా నిల్వ చేయాలో తెలుసు.. ఢిల్లీ పోలీసులు..

Exit mobile version