NTV Telugu Site icon

Ambati Rambabu: అవగాహన లేని డీజీపీ, ఎస్పీల వల్లే హింస..!

Ambati

Ambati

Ambati Rambabu: ఎన్నికల సమయంలో అవగాహన లేని డీజీపీ, ఎస్పీలను పెట్టడం వలస హింస జరిగిందని వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు.. డీజీపీ కార్యాలయానికి వెళ్లి వైసీపీ ప్రతినిధులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, పేర్నినాని.. తమ కేడర్‌పై టీడీపీ దాడులకు పాల్పడుతోందని డీజీపీకి ఫిర్యాదు చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారని ఆరోపించారు. మాకు బాగా ఓట్లు పడేచోట భారీగా పోలీసులను పెట్టారు.. టీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను పెట్టలేదని.. దీంతో వారు పోలింగ్ బూత్ లను క్యాప్చర్ చేశారు.. నన్ను హౌస్ అరెస్టు చేసి, నా ప్రత్యర్థిని యథేచ్చగా తిరగనిచ్చారు.. చాలా దుర్మార్గపు చర్యలకు దిగారు.. పోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారు.. అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది? అని ప్రశ్నించారు.

Read Also: Perni Nani: పోలింగ్ తర్వాత హింసకు వారే కారణం.. పక్కా ప్లాన్‌ ప్రకారమే దాడులు..!

ఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు అంబటి రాంబాబు.. పోలీసు పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధేశ్వరి ఆదేశాలతోనే చేశారని విమర్శించారు.. సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్న ఆయన.. తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఎన్నికల కమిషన్‌ ఎలా చెబుతుంది? అని నిలదీశారు.. వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.. ఇక, మీడియాతో మాట్లాడే అంబటి రాంబాబు.. ఏ అంశాలపై స్పందించారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..