ఏపీలో పోలింగ్ రోజు, అనంతరం 3 జిల్లాల్లో జరిగిన హింసపై ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి సీఈఓ కార్యాలయం నివేదిక పంపినట్లు తెలుస్తోంది. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో అత్యవసరంగా సమావేశం అయ్యారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ కూడా పాల్గొన్నారు.. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) సీరియస్ కావటం.. ఢిల్లీకి వచ్చి వివరణ �