Site icon NTV Telugu

Ambati Rambabu: శ్రీవారి లడ్డూ వివాదం.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు..

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: టీటీడీ లడ్డూ ప్రసాదం మీద ఆరోపణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దాడులు చేయటం ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్‌పై నిందలు వేయటానికి చంద్రబాబు టీటీడీని వేదికగా వాడుకుంటున్నారని అన్నారు. కూటమిలో భాగమైన బీజేపీ హంగామా చేస్తోందన్నారు. కూటమి పార్టీ కుట్రలను శ్రీవారు కూడా సహించరన్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో జరుగుతున్న అన్యాయాలను పురంధేశ్వరి పరిష్కారం చేయాలన్నారు.

Read Also: Nimmala Rama Naidu: మాల్యాల హంద్రీనీవా పంప్ హౌజ్‭ను పరిశీలించిన మంత్రి నిమ్మల..

అన్ని రోజులు కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉండదన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం ఉన్నపుడు విచారణ చేయకుండా ఆరోపణలు చేయటం ఎందుకని ప్రశ్నించారు. బట్టకాల్చి మా ముఖంమీద వేస్తున్నారని ఆయన అన్నారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ నుంచి సర్టిఫికెట్ వచ్చిందన్నారు. జగన్ అధికారంలో లేనపుడు ఇది జరిగితే జగన్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, పురంధేశ్వరీ మూకుమ్మడి ఆరోపణలు చేస్తున్నారన్నారని ఆయన అన్నారు. అందరూ కలిసి ఆరోపణలు చేసినంత మాత్రాన అవాస్తవాలు వాస్తవాలుగా మారవన్నారు. అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు దీక్ష చేయాలన్నారు. పవన్ ఎందుకు దీక్ష చేస్తున్నాడో అర్థం కావట్లేదన్నారు. దీక్షలను కూడా రాజకీయాల కోసం వాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

 

Exit mobile version