Ambati Rambabu: ఈసీపై అంబటి తీవ్ర ఆరోపణలు.. టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ఎలా ముగిసిందో ప్రజలందరూ చూశారని వ్యాఖ్యానించారు. పోలీసులు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చంటూ ఆయన వ్యంగ్యంగా విమర్శించారు.
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నారని, నామినేషన్లు వేయడానికి కూడా వీల్లేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని అంబటి ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరు అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు, టీడీపీ నాయకులు కలిసి వైఎస్సార్సీపీ నేతల నుంచి నామినేషన్ పత్రాలను లాక్కుంటూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా జరగకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమైనట్టేనని అంబటి వ్యాఖ్యానించారు. నామినేషన్ కేంద్రాల వద్దకు మీడియాను ఎందుకు రానివ్వడం లేదని ప్రశ్నించారు. తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులపై కూడా దాడులకు పాల్పడుతున్నారని, జనసేన మహిళల చీరలు లాగుతున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులపై దాడులు జరిగినప్పుడు ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు.
Also Read
- Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
- Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
అక్రమ అరెస్టుల ద్వారా ఎన్నికల్లో గెలిచినా అది నిజమైన గెలుపు కాదని అంబటి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది ఓటు మాత్రమేనని, ప్రజలు బ్యాలెట్ ద్వారా చంద్రబాబు, ఆయన కుమారుడికి తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు చంద్రబాబు, ఆయన కుమారుడు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సుప్రీంకోర్టును కూడా మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంబటి ఆరోపించారు. న్యాయవ్యవస్థను న్యాయదేవతే కాపాడాలని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ప్రస్తుత పరిణామాలకు తగిన ప్రతిఫలం ఉంటుందని అన్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠిపై కూడా అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి తలపై ఉన్న పోలీసు టోపీలు తీస్తే, ఇద్దరి తలలపైనా తెలుగుదేశం జెండాలే కనిపిస్తాయని వ్యాఖ్యానిస్తూ పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించారు. పల్నాడు ఎస్పీ ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తే ఆయనకు ప్రతికూల మార్కులు పడతాయని హెచ్చరించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
Ambati Rambabu: ఈసీపై అంబటి తీవ్ర ఆరోపణలు.. టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలా..?
-
Parvath Anurag: మా రౌడీని ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు.. కానీ మర్చిపోలేరు!
-
Women’s T20 World Cup: పాకిస్థాన్‌లో మహిళల టీ20 వరల్డ్ కప్.. భారత్ vs పాక్ మ్యాచ్ ఎక్కడంటే..?
-
Railway Group D Recruitment 2026: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. 30 వేల పోస్టులతో నోటిఫికేషన్..!
-
Ind Vs NZ 2nd T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టులోకి వైభవ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!