NTV Telugu Site icon

Ambani Dance Video: అనంత్-రాధిక ఎంగేజ్‌మెంట్‌లో అంబానీలు డ్యాన్స్‌తో అదరగొట్టేశారుగా..

Dance

Dance

Ambani Dance Video: పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ నిశ్చితార్థం జరిగిన సందర్భంగా అంబానీ కుటుంబం గురువారం ఒక డ్యాన్స్ షోను ఏర్పాటు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ నిశ్చితార్థం రాధికా మర్చంట్‌తో అంబానీ కుటుంబానికి చెందిన ముంబయి నివాసం అయిన యాంటిలియాలో జరిగింది. ఈ వేడుక సంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఈ వేడుకలో భాగంగా అంబానీ కుటుంబం తమ డ్యాన్సులతో అదరగొట్టింది.

Terror Attack: రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులపై కత్తితో దాడి.. వీడియో వైరల్

ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతా, కుమార్తె ఇషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరమల్ తమ స్టెప్పులతో అందరిలో ఉత్సాహాన్ని నింపారు. వారు “హమ్ అప్కే హై కౌన్” చిత్రం నుంచి ‘వా వాహ్ రామ్‌జీ’ వెర్షన్‌కు నృత్యం చేశారు. కొత్త జంట పేర్లను చేర్చడానికి సాహిత్యం మార్చబడింది. అంబానీ, మర్చంట్ కుటుంబాలు 2019లో ఈ జంట వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించారు. రాధికా మర్చంట్ ఈ వేడుక కోసం గోల్డెన్ లెహెంగాను ఎంచుకున్నారు. అనంత్ అంబానీ నీలం రంగు దుస్తులను ధరించారు.

 

Show comments