దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు ఉద్యోగుల పని విషయంలో చూసిచూడనట్లు ఉన్న.. ఈ-కామర్స్ సంస్థ.. ప్రస్తుతం.. కఠినంగా వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగా ఉద్యోగులు వారానికి మూడు రోజులు తప్పని సరిగా ఆఫీస్‌కు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే, యాజమాన్యం చెప్పినట్లు చేయకపోతే తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, గత ఏడాది నుంచి అమెజాన్ ఉద్యోగుల్ని తొలగించడమే ఇందుకు ప్రధాన కారణం.
Read Also: Heavy Rains: జమ్మూ కాశ్మీర్లో ఎడతెరిపిలేని వానలు.. ఇబ్బందులు పడుతున్న జనాలు
ఇక, ఉద్యోగులు ఆఫీస్ నుంచి పని చేయాలంటూ అమెజాన్ ఆదేశాలు జారీ చేసినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది. మరి వారానికి ఎంతమంది ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.. బహుశా..! కరోనా నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్‌కి పరిమితమైన ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా అమెజాన్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుల నుంచే పనిచేయడం వల్ల మరింత ఉత్సాహంతో పనిచేయడంతో పాటు తోటి ఉద్యోగులతో సన్నిహిత సంబంధాలు, వ్యాపార వృద్ది మెరుగు పడుతుందనే ఆయన చెప్పాడు.
Read Also: BRICS: వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు.. రష్యా విదేశాంగ శాఖ కీలక ప్రకటన
దీంతో అమెజాన్ సంస్థ తీసుకునే రోజువారీ నిర్ణయాలు నేరుగా ఉద్యోగులతో చర్చించే వెసులు బాటు కలుగుతుందని సంస్థ అధికారి తెలిపారు. అయినప్పటికీ, అమెజాన్‌లో ఉద్యోగులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ ఏడాది అమెజాన్ సంస్థ 27 వేల మంది ఎంప్లయిస్న్ ఇంటికి పంపించింది. తన కార్పొరేట్ వర్క్ ఫోర్స్‌లో అధిక శాతం వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి రావాలని వెల్లడించింది. అయితే, సంస్థ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సియోటల్‌లో ఉద్యోగులు నిరసన చేశారు. ఈ క్రమంలో కంపెనీ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Rashmika Mandanna : నేషనల్ క్రష్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
అయితే, మరోవైపు దేశీయ టెక్ కంపెనీలైన టీసీఎస్, విప్రో,హెచ్‌సీఎల్‌లు ఉద్యోగులు ఆఫీస్ రావాలని గట్టి ఆదేశాలను జారీ చేశాయి. ఇప్పటికే 50 శాతానికి పైగా ఉద్యోగులు కార్యాలయలకు వచ్చి పనిచేస్తున్నారని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అందరూ ఉద్యోగులు ఆఫీసులకు వస్తారని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు.