Amazon Prime Day : అమెజాన్ కంపెనీ ఈ ఏడాది భారతదేశంలో మరోసారి ప్రైమ్ డే సేల్స్ కు సిద్ధమవుతోంది. ప్రైమ్ డే సేల్ జూలై 20, 21 తేదీలలో జరుగుతుంది. జూలై 20 అర్ధరాత్రి నుండి మొదలయ్యే ఈ ప్రైమ్ డే సేల్ లో అమెజాన్ తన కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్ లను అందించనుంది. కేవలం డిస్కౌంట్ లో మాత్రమే కాకుండా ఆకర్షణమైన ఆఫర్లతో పాటు బెస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందించనుంది. రెండు రోజులపాటు జరిగే ఈ సేల్ ముఖ్యంగా అమెజాన్ తన ప్రైమ్ కస్టమర్ ల కోసం తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ఈ ప్రైమ్ డే సేల్ వివిధ రకాల బ్రాండ్లకు సంబంధించిన వాటిపై లెక్కలేనన్ని డిస్కౌంట్స్ ఉండనున్నాయి.
AP NEWS: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమల్లోకి కొత్త ఇసుక పాలసీ
స్వదేశీ, విదేశీ బ్రాండ్లతో ఏకంగా 450 కంపెనీల నుండి ఎక్కువ బ్రాండ్స్ ఈసారి ప్రైమ్ డే లో జరగనున్నాయి. సాంసంగ్, సోనీ, ఇంటెల్, వన్ ప్లస్ ఇలా అనేక రకాల బ్రాండ్స్ ఈ సేల్ లో పాల్గొనబోతున్నాయి. ఇక ప్రైమ్ డే సేల్స్ లో కస్టమర్లకు మరింత తక్కువ ధరకు వారికి కావాల్సిన వస్తువులను అందించేందుకు ఎస్బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ సాయం చేయనున్నాయి. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ పై ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ అలాగే అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కు 2500 రూపాయలు., అలాగే అమెజాన్ ప్రైమ్ కస్టమర్స్ కోసం రూ. 300 క్యాష్ బ్యాక్ తో పాటు 2200 రివార్డ్స్ కూడా వారు పొందవచ్చు. 30 రోజుల ఉచిత ట్రైల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు కూడా ఈ ఆఫర్స్ ను పొందవచ్చు.
Kalki 2898 AD : కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ నెలకు రూ. 299, మూడు నెలలకు రూ. 599, సంవత్సరానికి రూ. 1499 గా ఉన్నాయి. ఇక ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ ద్వారా ఫాస్ట్ డెలివరీతో పాటు ప్రైమ్ మెంబర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, అలాగే మ్యూజిక్ లాంటి మరికొన్ని సదుపాయాలను కూడా కస్టమర్లు పొందవచ్చు.