Amazon : నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మోడీ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఇరుదేశాల మధ్య చారిత్రాత్మకమైన ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం పలు దిగ్గజ కంపెనీల సీఈవోలతో సంభాషించారు. ఈ క్రమంలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ మోడీతో సమావేశమైన అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మోడీ తో చర్చలు ఫలవంతంగా జరిగినట్లు చెప్పారు. భారత్ లో ఇప్పటికే 11 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టామని, రాబోవు రోజుల్లో మరో 15 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు పెడతామని సీఈవో ప్రకటించారు. అప్పుడు అమెజాన్ భారత్ లో పెట్టిన పెట్టుబడుల మొత్తం 26 బిలయన్ డాలర్లకు చేరుతుందన్నారు. మున్ముందు నెలకొల్పబోయే భాగస్వామ్యాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
Read Also:Viral News: ఇదెక్కడి దారుణం.. అధికారి భార్య చెప్పులిప్పించాడని అటెండర్ బట్టలిప్పించారు?
భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్జీ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మోడీతో అమెజాన్ సీఈఓ సమావేశమయ్యారని, భారత్ లో లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడుల గురించి చర్చలు సఫలమయ్యాయని చెప్పారు. భారత్ లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను డిజిటలైజ్ చేయాలనే అమెజాన్ కార్యక్రమాన్ని మోడీ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా చివరి రోజు వాషింగ్టన్ లో దిగ్గజ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో కలిసి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. అధునాతన సాంకేతికత, పరిశోధన అభివృద్ధిలో అమెరికా, భారత్ సంస్థాగత సహకారాన్ని బలపరచుకునేందుకు అవకాశాల గురించి చర్చించారు.
Read Also:Wagner Mutiny: రష్యాలో వాగ్నర్ తిరుగుబాటు.. సంచలన వ్యాఖ్యలు చేసిన జెలెన్స్కీ