ఏపీలో తమ డిమాండ్ల సాధనకు ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు. సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన ఏపీ జేఏసీ అమరావతి బృందం తమ వైఖరిని స్పష్టం చేసింది. నిన్నటి చర్చల తర్వాత కూడా ఉద్యమ కార్యాచరణ కంటిన్యూ చేస్తామని స్పష్టం చేశారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. సీఎస్ జవహర్ రెడ్డితో సమావేశం ముగిశాక మీడియాతో మాట్లాడారు బొప్పరాజు. పెండింగ్ బిల్లులను మూడు దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిన్నటి చర్చల సారాంశాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డిని కోరాం.
Read Also: Ramabanam: ఉమెన్స్ డే రోజున ‘విక్కీ’ గర్ల్ ఫ్రెండ్ ని రివీల్ చేశారు…
సాయంత్రంలోపు చర్చల మినిట్స్ ఇస్తామని సీఎస్ స్పష్టం చేశారు. సాయంత్రంలోగా మినిట్స్ ఇస్తే.. రేపు ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. సాయంత్రంలోగా మినిట్స్ ఇవ్వకుంటే.. ఉద్యమ కార్యాచరణ యధావిధిగా జరుగుతుంది. మినిట్స్ ఇస్తే.. ఉద్యమాన్ని రేపు మధ్యాహ్నాం వరకు వాయిదా వేస్తాం.. కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం.మినిట్స్ ఇచ్చిన తర్వాత కూడా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఉద్యమిస్తాం.ఆయుధం మా చేతుల్లోనే ఉంది.మేం ప్రభుత్వం ట్రాపులో పడడం లేదు.ఎమ్మెల్సీ ఎన్నికలతో మాకు సంబంధం లేదు. మా అజెండా నుంచి పక్కకు వెళ్లం అన్నారు అమరావతి జేఏసీ సారథి బొప్పరాజు.
Read Also: Sushmita Sen : గుండెపోటు తర్వాత ఫోటో పోస్ట్ చేసిన సుస్మితా సేన్.. ఆరోగ్యంపై అప్‌డేట్
