CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CRDA: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో గ్రామకంఠం మినహాయింపుల అంశంపై ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) కీలక స్పష్టత ఇచ్చింది. గ్రామకంఠం మినహాయింపులకు 2014 డిసెంబర్ 8ను కటాఫ్ తేదీగా నిర్ణయించినట్లు తెలిపింది. ఈ తేదీకి ముందే నిర్మాణాలు ఉన్న భూములకు మాత్రమే మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే, 2014 డిసెంబర్ 8 తర్వాత జరిగిన రిజిస్ట్రేషన్ల ఆధారంగా గ్రామకంఠం మినహాయింపు ఇవ్వబోమని CRDA పేర్కొంది. కటాఫ్ తేదీకి ముందు ఉన్న నిర్మాణాలు, సంబంధిత రికార్డులను ఆధారంగా చేసుకుని అర్హతను నిర్ణయించనున్నట్లు తెలిపింది.
6,473 ఎకరాలకు మినహాయింపు
ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS) నుంచి ఇప్పటికే 6,473.72 ఎకరాలను మినహాయించినట్లు CRDA వెల్లడించింది. ఇంకా పరిష్కారం కాని దరఖాస్తులను పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇక, అపరిష్కృతంగా ఉన్న 685 దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతున్నట్లు CRDA తెలిపింది. ఇందుకోసం సంబంధిత భూముల రికార్డులతో పాటు శాటిలైట్ చిత్రాలను కూడా పరిశీలనలో భాగంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
జాయింట్ కలెక్టర్ కమిటీ నిర్ణయం
దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హతపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయం తీసుకోనుంది. నిబంధనలకు అనుగుణంగా అర్హత పొందిన రైతులకు గ్రామకంఠం మినహాయింపుతో పాటు వర్తించే అన్ని ప్రయోజనాలను అందిస్తామని CRDA స్పష్టం చేసింది. గ్రామకంఠం మినహాయింపుల విషయంలో కటాఫ్ తేదీ, నిర్మాణాల వివరాలు, రిజిస్ట్రేషన్ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామని CRDA తెలిపింది.
తాజావార్తలు
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!