AP Capital Amaravati: అమరావతి రాజధానిగా హర్షం.. కానీ ఉద్యోగుల కష్టాలు తీరేదెప్పుడు? APJAC సూటి ప్రశ్న.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించడాన్ని ప్రశంసిస్తూ ఏపీ జేఏసీ (APJAC) అమరావతి ఉద్యోగుల సంఘం శనివారం విజయవాడలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంది. ఈ సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ ఉద్యోగుల ప్రస్తుత దీనస్థితిని వివరిస్తూ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు.
Also Read
- Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
- AP Local Body Elections: ఏపీ స్థానిక ఎన్నికలపై మరో పిటిషన్..
- Paras Dogra: అత్యధిక రంజీ మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్.. రికార్డు స్పష్టించిన పరాస్ డోగ్రా..
- Ind Vs NZ 3rd T20: వెల్లింగ్టన్ టీ20కి సర్వం సిద్ధం.. ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన స్టార్ బ్యాట్స్‌మెన్స్..
చాలాకాలంగా రాజధాని లేదనే భావన ఉద్యోగులలో ఉండిపోయిందని, సుస్థిర పాలన కోసం అమరావతిని రాజధానిగా ఖరారు చేసిన ప్రధాని మోదీకి ఈ సందర్భంగా బొప్పరాజు అభినందనలు తెలిపారు. అయితే రాజధానిలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు. 12వ పీఆర్సీ (PRC) అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని తప్పుపడుతూ, వెంటనే పీఆర్సీ కమిషనర్ ను నియమించాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వంలో ఐఆర్ 27% ఇచ్చారని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో దాని గురించి కనీసం చర్చ కూడా జరగడం లేదని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మూడేళ్ల నుంచి ఐఆర్ తీసుకుంటున్నారు. మేము ఐఆర్ లేకుండా ఎలా పని చేయాలో ప్రభుత్వం ఆలోచించాలి. రావాల్సిన బకాయిలు అందకుండానే రిటైర్ అయిన ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. నేడు ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత దీనస్థితిలో ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. మోదీని ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.
ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ మాట్లాడుతూ.. ఈహెచ్ఎస్ (EHS) విధానంలో మార్పులు చేసి పూర్తిగా క్యాష్లెెస్ ట్రీట్మెంట్ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అలాగే, ఆర్టీసీలో 10 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ‘స్త్రీశక్తి’ పథకం తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరిగి ఉద్యోగులపై పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి తట్టుకోలేక ఆర్టీసీలో రోజుకొక ఉద్యోగి చనిపోతున్నారని ఆయన వాపోయారు.
ప్రభుత్వంలోని ఏ విభాగంలోనూ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు లేకుండా చేశారని, ఒక్కో ఉద్యోగి నలుగురి పని చేయాల్సి వస్తోందని సంఘం నేతలు మండిపడ్డారు. 2018 నాటి డీఏ అరియర్స్ కూడా ఇంకా 40% మందికి అందలేదని గుర్తుచేశారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి స్పందనను బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని, పరిష్కారం లభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
-
Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
-
Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి
-
AP Local Body Elections: ఏపీ స్థానిక ఎన్నికలపై మరో పిటిషన్..
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!