Muhajir in Pakistan: ‘ప్లీజ్ భారత్ నుంచి వచ్చిన వలసదారులను రక్షించండి’.. పాక్ నాయకుడు పీఎం మోడీకి విజ్ఞప్తి
- ప్లీజ్ భారత్ నుంచి వచ్చిన వలసదారులను రక్షించండి
- అల్తాఫ్ హుస్సేన్ ప్రధాని మోడీని అభ్యర్థించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య, బహిష్కృత పాకిస్తాన్ నాయకుడు, ముత్తహిదా క్వామీ ఉద్యమం (MQM) వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి సహాయం కోరాడు. ఉర్దూ మాట్లాడే శరణార్థులు, అంటే దేశ విభజన తర్వాత భారత్ నుంచి వచ్చి పాకిస్తాన్లో స్థిరపడిన ముహాజీర్లను హింసించే అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తాలని అల్తాఫ్ హుస్సేన్ ప్రధాని మోడీని అభ్యర్థించారు. లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.
Also Read:Jailer2 : రజనీకాంత్‌కి విలన్‌గా నాగార్జున?.. ఇదెక్కడి మాస్‌రా మామ
Also Read
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
తన ప్రకటనలో.. బలూచ్ ప్రజలకు మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోడీని ఆయన ప్రశంసించారు. దీనిని సాహసోపేతమైన, నైతికంగా ప్రశంసనీయమైన చర్యగా అభివర్ణించారు. ముహాజిర్ సమాజానికి కూడా ఇలాంటి మద్దతు కోసం స్వరం పెంచాలని ఆయన ప్రధాని మోడీని అభ్యర్థించారు. ముహాజీర్లు దశాబ్దాలుగా అణచివేత, వివక్షను ఎదుర్కొంటున్నారని అల్తాఫ్ చెప్పారు. భారత్ నుంచి విడిపోయినప్పటి నుంచి పాకిస్తాన్ సైనిక వ్యవస్థ ముహాజీర్లను దేశ చట్టబద్ధమైన పౌరులుగా పూర్తిగా అంగీకరించలేదని ఆయన అన్నారు. ఈ అణగారిన వర్గాల హక్కులను MQM నిరంతరం సమర్థించింది. కానీ పాక్ సైనిక చర్య ఇప్పటివరకు 25,000 మందికి పైగా ముహాజీర్ల మరణానికి దారితీసిందని అన్నారు.
Also Read:Jailer2 : రజనీకాంత్‌కి విలన్‌గా నాగార్జున?.. ఇదెక్కడి మాస్‌రా మామ
అమెరికాలోని హ్యూస్టన్‌లోని పాకిస్తాన్ కాన్సుల్ జనరల్ అఫ్తాబ్ చౌదరి ఈ కార్యక్రమంలో అల్తాఫ్, ఎంక్యూఎంలను భారతదేశ ఏజెంట్లుగా చూపించిన వీడియోను ప్రదర్శించారని అల్తాఫ్ హుస్సేన్ చెప్పారు. ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా ముహాజీర్ల గొంతును అణచివేసే ప్రయత్నం జరుగుతుందని ఆయన అన్నారు. పాకిస్తాన్లో ముహాజీర్లు నిస్సహాయులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోడీ ఈ వలసదారుల గొంతుకను వినిపించాలని, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఈ సమాజంలోని ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..