Allu Sirish Engagement: హైదరాబాద్‌లో శుక్రవారం అల్లు కుటుంబంలో శుభకార్యం జరిగింది. ప్రముఖ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో శిరీష్- నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే సాగింది. చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు తమ కుటుంబాలతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. నయనిక కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ వేడుకను సింపుల్‌గా, చాలా ఎలిగెంట్‌గా నిర్వహించారు. ఇరు కుటుంబాల మధ్య ఈ వేడుకను సందడిగా నిర్వహించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు శిరీష్-నయనిక నిశ్చితార్థ వేడుక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్, సినీ ప్రముఖులు శిరీష్–నయనిక జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
READ ALSO: Asia Cup 2025: రెండు రోజుల్లో భారత్‌కు ఆసియా కప్.. !
