Allu Arjun : సినీ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు బన్నీపై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ప్రస్తుతం హైకోర్టులో మధ్యంతర బెయిల్ పై ఉన్నాడు. నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పై వాదనలు ముగిశాయి.. కోర్టు తీర్పు వెలువరించింది.
నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చార్జిషీట్ దాఖలు చేసే వరకు రెండు నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా అర్జున్ దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. ప్రతి వ్యక్తికి ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు పేర్కొంది. దీనితో పాటు, తనను విచారిస్తున్న పోలీసులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెదిరించవద్దని కోర్టు అల్లు అర్జున్ కు సూచించింది. ఈ కేసులో సాక్షులను బెదిరించడానికి ప్రయత్నించవద్దని కోర్టు హెచ్చరించింది.
Read Also:Britain PM vs Elon Musk: బ్రిటన్ ప్రధానిపై ఎలాన్ మస్క్ తీవ్ర ఆరోపణలు.. కీర్ స్టార్మర్ కౌంటర్..
ఈ క్రమంలో ఈ రోజు అల్లు అర్జున్ మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు ఆయన సమర్పించనున్నారు. లంచ్ సమయం లోపలే కోర్టు కు వెళ్లి పత్రాలు సమర్పిస్తారు. స్వయంగా మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ఈ నెల 4వ తేదీన పుష్ప బెనిఫిట్ షో రోజున సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సినీ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వెళ్లారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ను చూడటానికి అభిమానులు పరుగులు తీశారు. ఈ కారణంగా అక్కడ అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో దిల్ సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు కూడా కిందపడి ప్రజల కాళ్ల కింద నలిగిపోయారు. ఈ ఘటనలో రేవతి మరణించారు. ఆమె కుమారుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Read Also:Duddilla Sridhar Babu : అగ్ని మాపక శాఖలో చేరబోతున్న 196 డ్రైవర్ ఆపరేటర్లకు అభినందనలు..