Daggubati Purandeswari : కేంద్రం జమిలిపై జేపీసీని నియమించింది..
- అల్లు అర్జున్ ఆ సినిమా హీరో కాబట్టే ఆరోజు ధియేటర్ దగ్గరకు వచ్చారు
- ఆయన ప్రేరేపిస్తే జరిగిన ఘటన కాదది
- కేంద్రం జమిలిపై జేపీసీని నియమించింది
- అందరి అభిప్రాయాలను జేపీసీ సేకరించి పార్లమెంట్ ఉభయ సభల ముందు ఉంచుతుంది :దగ్గుబాటి పురందేశ్వరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari : టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్పా-2’ చిత్రం విడుదల నేపథ్యంలో, థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్ళిన అల్లుఅర్జున్‌పై జరిగిన ఘటన గురించి బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె ప్రకాశంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా అల్లు అర్జున్ను అరెస్టు చేయడం సరైనదే కాదని వ్యాఖ్యానించారు.
అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ఈనెల 13వ తేదీన అరెస్టు చేశారు. ‘పుష్పా-2’ సినిమా చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ చుట్టూ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కలకలం రేపింది. ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు, అందులో సంధ్యా థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ కూడా ఉన్నారు. పోలీసులు ఈ ముగ్గురిని రిమాండ్‌కు పంపించారు, ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
Game Changer : నా ఫోన్లో రామ్ చరణ్ పేరును ‘ఆర్సీ ద కింగ్’ అని సేవ్ చేసుకున్న : ఎస్ జే సూర్య
ఇక జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం గురించి పురందేశ్వరి పేర్కొన్నారు. బిల్లును జేపీసీకి రిఫర్ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ బిల్లును పరిశీలించడానికి జేపీసీ ఏర్పాటయిందని, పార్టీలు, ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జమిలి ఎన్నికల సవరణ బిల్లును లోక్ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు.
ఈ బిల్లుపై చర్చ జరుగుతుందని, సమగ్ర సమీక్షకు జేపీసీ వద్ద బిల్లును పంపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అర్జున్ రామ్ మేఘవాల్ చెప్పారు. ఇదే సమయంలో, పార్లమెంట్లో బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు పడ్డాయి, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ కొత్త పార్లమెంట్ భవనంలో నిర్వహించారు.
Congo: కాంగోలో పడవ బోల్తా.. 38 మంది మృతి, 100కి పైగా గల్లంతు!
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!