ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలుసు.. ఆయన సినిమాల కోసం కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. పుష్ప సినిమా తో ఆయన సాధించిన క్రేజ్ అలాంటిది మరి. ఇప్పుడు ఆయన హీరో గా నటిస్తున్న ‘పుష్ప : ది రూల్’ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు 15నా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
ఇకపోతే సినిమాల పరంగానే కాక బిజినెస్‌ల పరంగా కూడా భారీగానే సంపాదిస్తున్నాడు. పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం, ఫుడ్, రెస్టారెంట్స్ రంగంలో దూసుకుపోతున్నాడు. మరోవైపు తన ఫ్యామిలీకి సంబంధించిన తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ సక్సెస్ ఫుల్‌గా రన్ అయ్యేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. అడపాదడపా ఆహాలో మెరుస్తూ సందడి కూడా చేస్తున్నాడు.. యాడ్స్ కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ న్యూ లుక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
సోషల్ మీడియాలో కూడా బన్నీ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటాడు.. తాజాగా స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. బ్లాక్ షర్ట్ వేసుకొని గాగుల్స్ పెట్టుకొని కూల్ గా చూస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అల్లు అర్జున్ కొత్త లుక్ అదిరిపోయింది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాను చేస్తున్నాడు..