ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్స్ కు మరియు డాన్స్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాలో నటిస్తున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను మొదటి భాగం కంటే ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తాజాగా స్టైలిష్ లుక్ లో కనిపించాడు.వెండి తెర పై డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించి ఎంతగానో అలరించే అల్లు అర్జున్ కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్ లో కనిపిస్తూ ఎంతగానో ఆకట్టుకుంటాడు.. ఇప్పటికే ఎన్నో బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించిన ఐకాన్ స్టార్ తాజాగా మరో ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థకు అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు.
తాజాగా ట్రావెల్ + లీజర్ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ అల్లుఅర్జున్ దిగిన ప్రత్యేకమైన ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ట్రావెల్ + లీజర్ సంస్థ సౌత్ ఏషియా లోనే ప్రముఖ పట్టణాలలో ఎంతో పాపులారిటీ ని సంపాదించుకుంది.ఈ సంస్థ తమ ప్రొడక్ట్స్ కు అంబాసిడర్ గా అల్లు అర్జున్ ని ప్రకటించడంతో పాటు ఆయనకీ సంబంధించిన ఎంతో స్టైలిష్ లుక్స్ ని కూడా విడుదల చేసారు.ఈ పిక్స్ లో లో అల్లు అర్జున్ మరింత స్టైలిష్‌గా కనిపించి ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.లాంగ్ కర్లీ హెయిర్ తో అదిరిపోయే డ్రెస్ లో అల్లు అర్జున్ ఎంతో డిఫరెంట్ గా కనిపించాడు. ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ మారుతూ వుండే సరికొత్త స్టైల్స్ తో అల్లు అర్జున్ ఆకట్టుకుంటూ ఉంటాడు.. అల్లు అర్జున్ ప్రతి సినిమాకి తన లుక్ ను చేంజ్ చేస్తూ ఫ్యాన్స్ ను ఎంతగానో మెప్పిస్తూ ఉంటాడు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.