Site icon NTV Telugu

Allu Arjun Birthday: అల్లు అర్జున్ బర్త్‌డే.. పుష్పరాజ్ ఇంటిముందు భారీగా ఫాన్స్!

Allu Arjun

Allu Arjun

Huge Fans at Allu Arjun’s Home: ‘పుష్ప’ సినిమాతో పాన్‌ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో ‘అల్లు అర్జున్‌’. ‘నీ యవ్వ తగ్గేదేలే’, ‘పుష్ప.. ఫ్లవర్‌ కాదు, ఫైర్‌’ అంటూ అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాల్ని సృష్టించాయి. పుష్ప చిత్రం జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ని నిలపడమే కాకుండా.. తెలుగు సినిమాకి అరుదైన గౌరవం లభించేలా చేసింది. పుష్పతో సంచనాలు సృష్టించిన అల్లు అర్జున్‌.. ‘పుష్ప 2’తో త్వరలోనే ప్రేక్షకులను అలరించనున్నాడు. పుష్పరాజ్‌గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన అల్లు అర్జున్‌ పుట్టినరోజు నేడు.

అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అర్ధ రాత్రి నుంచే కేక్స్ కట్ చేస్తూ సందడి చేస్తున్నారు. కొందరు ఫాన్స్ అర్ధ రాత్రి అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్లారు. గేటు ముందు నిల్చొని హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్, హ్యాపీ బర్త్‌డే పుష్ప అంటూ గట్టిగా అరిచారు. ఫాన్స్ కోసం అల్లు అర్జున్ ఇంట్లోనుంచి బయటికి వచ్చి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. దాంతో ఫాన్స్ ఖుషీ అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: CSK vs KKR: కోల్‌కతాతో మ్యాచ్‌.. చెన్నైకి శుభవార్త!

సోమవారం అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప 2’ టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేస్తోంది. ఈ మేరకు ఆదివారం పోస్టర్‌ని రిలీజ్ చేశారు. సుకుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది.

Exit mobile version