Allu Arjun : అట్లీ మూవీలో.. పాపం మృణాల్‌కి అలాంటి క్యారెక్టర్ ఇచ్చారేంటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై అంచనాలు రోజే రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో సెన్సేషనల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించబోతున్న సంగతి తెలిసిందే. కానీ, అందరూ ఆశించినట్లు ఆమె హీరోయిన్గా కాకుండా, బన్నీకి సిస్టర్ రోల్లో కనిపించబోతోందని టాక్ నడుస్తోంది. ఎంతో ఎమోషనల్ టోన్ ఉన్న ఈ పాత్ర చుట్టూనే కథ మలుపు తిరుగుతుందని సమాచారం. ‘సీతారామం’తో అందరి గుండెల్లో హీరోయిన్గా ముద్ర వేసుకున్న మృణాల్‌ను ఇలాంటి పాత్రలో చూడటం ఏంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
మరోవైపు, ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ భామలు దీపికా పడుకోణె, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్లో ఒక పవర్ఫుల్ డాన్ కథగా ఉండబోతుందట. అట్లీ ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి చేసి, ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్స్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నాడట. మరి మృణాల్ పాత్ర నిజంగానే సిస్టర్ రోల్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Also Read
తాజావార్తలు
-
School Holiday: విద్యార్థులకు అలర్ట్.. రేపు పాఠశాలలకు సెలవు..?
-
Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
-
Epic : ఆనంద్ దేవరకొండ ఎపిక్ రిలీజ్ ఆరోజే!
-
Lucknow Tragedy: లక్నో కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం
-
MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!