ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గారాలా పట్టి అల్లు అర్హ గురించి పరిచయాలు అవసరం లేదు.. ఈ వయస్సులోనే వరుస సినిమాలను చేస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియా లో కూడా ఫాలోయింగ్ ఎక్కువే.. సమంత నటించిన శాకుంతలం తో వెండితెరకు కూడా పరిచయమైంది అర్హ. అందులో తను పోషించిన భరతుడి పాత్ర అందరి ప్రశంసలు అందుకుంది.. ఆ సినిమా హిట్ అవ్వకపోయిన అమ్మడు పేరు మాత్రం బాగా ఫెమస్ అయ్యింది.. నటన పరంగా అందరు ఫిదా అవుతున్నారు..
ఇప్పుడు మరో పెద్ద లోనూ ఛాన్స్ దక్కించుకుంది అర్హ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న దేవర అనే లో బన్నీ కూతురు నటించనున్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న జాన్వీ కపూర్ చిన్నప్పటి పాత్రలో అర్హ నటిస్తుందని తెలుస్తుంది.. త్వరలోనే దేవర షూటింగ్‌లో తను జాయిన్ కానుందని వస్తున్నాయి.. అర్హ పాత్ర భిన్నంగా ఉంటుందని సినిమాలో హైలెట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు..
ఇకపోతే ఇప్పుడు మరో వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.. ఈ సినిమా లో అర్హ పాత్ర కేవలం 10 నిమిషాలే ఉంటుందని, ఇందుకోసం మేకర్స్ ఏకంగా రూ. 20 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వనున్నరని టాక్ వినిపిస్తోంది. అంటే నిమిషానికి రూ. 2 లక్షలన్నమాట.. ఇది మామూలు విషయం కాదు.. ఇంత చిన్న వయస్సులోనే అంత సంపాదిస్తుంది అంటే పెద్దతే మాత్రం స్టార్ హీరోయిన్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. స్క్రీన్ పై కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు..