NTV Telugu Site icon

AP Politics: ఆసక్తిరేపుతున్న ఏపీ రాజకీయాలు.. ఈ పార్టీల మధ్య పొత్తు ఖరారు

Ap Politics

Ap Politics

ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. పొత్తుల విషయంలో జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు మధ్య చర్యలు సానుకూలంగా జరిగినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 5 నుంచి 6 లోక్ సభ స్థానాలు, 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నట్లు సమాచారం. విజయవాడ, ఏలూరు, గుంటూరు, రాజమండ్రి, రాజంపేట, విశాఖ లోక్ సభ స్థానాలు బీజేపీకి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

Read Also: Amit Shah: కేంద్రం కీలక నిర్ణయం.. మయన్మార్‌కు రాకపోకలు బంద్

ఇక జనసేనకు 3 లోక్ సభ స్థానాలు, 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉంది. మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడ లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుందనట్లు సమాచారం. త్వరలోనే జనసేన-టీడీపీ నేతల మధ్య పూర్తిస్థాయిలో చర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వ్యూహాత్మకంగా పొత్తులపై నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర నాయకులతో చర్చించిన తర్వాత.. పొత్తులపై తుది నిర్ణయం తీసుకోనుంది బీజేపీ అధిష్టానం. మరోవైపు.. సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ముగ్గురు నేతలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. సీట్ల కేటాయింపుపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది కమిటీ. కచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి ఏర్పడబోతుందని.. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

Read Also: Kodi Kathi Case: కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనుకు ఊరట.. బెయిల్ మంజూరు