Alleti Maheshwar Reddy : రుణమాఫీకి ఇన్ని కండిషన్స్ ఎందుకు..?
- రుణమాఫీ మార్గదర్శకాలపై స్పందించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- బ్యాంకర్లు చేసిన తప్పిదాలకు రైతు బలి అవుతారన్న మహేశ్వర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. రుణమాఫీ మార్గదర్శకాల పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎటువంటి కండిషన్ లేకుండా రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, మరి ఈరోజు ఇన్ని కండిషన్స్ ఎందుకు.? అని ఆయన అన్నారు. రీ షెడ్యూల్ అయిన రుణాలకు మాత్రమే రుణమాఫీ ఇస్తామని అంటున్నారని, చాలా బ్యాంకులు లోన్ రికవరీ అయ్యి మళ్ళీ కొత్తగా లోన్ ఇచ్చినట్టు బ్యాంకర్లు రైతు పుస్తకాల్లో రాసుకుంటారన్నారు. వాటి కి వర్తించదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. బ్యాంకర్లు చేసిన తప్పిదాలకు రైతు బలి అవుతారని, ఎందుకీ కండిషన్ ? అని ఆయన ప్రశ్నించారు.
Donald Trump: ట్రంప్‌పై దాడి ఘటన.. 3 తుపాకుల నుంచి 9 రౌండ్లు కాల్పులు
Also Read
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
- Kia Syros Flex Fuel: 100% ఇథనాల్‌తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టీ చాలా మందిని ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకే రేషన్ కార్డు లో ఉన్న అన్నదమ్ములు భూములు పంచుకొని విడివిడిగా లోన్ తీసుకుంటారని, వారి పరిస్థితి ఏంటి..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రేషన్ కార్డు లో నలుగురి మీద లోన్ ఉంటే ఒక్కరికే ఇవ్వడంతో మిగతా వారు నష్టపోతారన్నారు. కుటుంబంలో ఒక్కరికీ చిన్న ఉద్యోగం ఉన్న కుటుంబం మొత్తానికి తెల్ల రేషన్ కార్డు తీసేస్తారని, వారి పరిస్థితి ఏంటని ఆయన అన్నారు. కండిషన్ పెట్టడం సరైన పద్ధతి కాదని, చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి కండిషన్ లేకుండా రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
KP Sharma Oli: నాలుగోసారి నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణం.. మోడీ అభినందనలు
తాజావార్తలు
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
-
Kia Syros Flex Fuel: 100% ఇథనాల్‌తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
-
Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!