NTV Telugu Site icon

Alleti Maheshwar Reddy: సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి

Mla Maheshwar Reddy

Mla Maheshwar Reddy

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనా దినోత్సవంగా నిర్వహించాలని….ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఓవైసీలకు భయపడే రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను విమోచనా దినోత్సవంగా నిర్వహించడం లేదని, గతంలో బీఆర్ఎస్ కూడా ఒవైసీలకు భయపడే నిర్వహించలేదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ లో వున్నప్పుడు సమైక్యత దినోత్సవంగా నిర్వహించారని, ఇప్పడు కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన దినోత్సవం అంటోందన్నారు మహేశ్వర్‌ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కొక్కరు ఒక్కో పేరుతో తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను విస్మరిస్తున్నాయని, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూ అవకాశం ఉంది, రాజకార్ల అరాచక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన అమరుల త్యాగాలను గౌరవించి, ప్రజా పాలన దినోత్సవం పేరు కాకుండా… తెలంగాణ విమోచన దినోత్సవం గా నిర్వహించాలన్నారు మహేశ్వర్‌ రెడ్డి.

CM Revanth Reddy : నేను చీఫ్ అయ్యాకా.. ఇంద్రవెల్లి నుండి సమరశంఖం పూరించాం

లేకుంటే తెలంగాణ ప్రజలు రేవంత్ సర్కార్ కు తగిన గుణపాఠం చెబుతారని, కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంటే… రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఈ సారి కూడా రాష్ట్రంలో తెలంగాణ విమోచనా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని, తెలంగాణ నుంచి విడిపోయి మహారాష్ట్ర, కర్ణాటక లో కలిసిన జిల్లాలోనూ …. విమోచనా దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నారన్నారు. తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏంఐఏం కూ భయపడి, సెప్టెంబర్ 17ను విమోచనా దినోత్సవంగా జరపడం లేదన్నారు మహేశ్వర్‌ రెడ్డి.

Neeraj Chopra: చేతికి ఫ్రాక్చర్‌తో డైమండ్ లీగ్లో పాల్గొన్న నీరజ్ చోప్రా..

Show comments