Site icon NTV Telugu

Alleti Maheshwar Reddy : భూములు ఎవరు కాజేశారనేది వెల్లడించాలి

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy

 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ రోజు అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ తో బీఅర్ఎస్ నేతలు వేల కోట్ల ఎకరాలు కబ్జా చేశారని వార్తలు వచ్చాయన్నారు. ఆ నేతలు ఎవరు? కాజేసిన భూమి ఎది? అనేది కాంగ్రెస్ బహిర్గతం చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరి కాకి లెక్కలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. భూములు ఎవరు కాజేశారనేది వెల్లడించాలని మహేశ్వర్‌ రెడ్డి కోరారు. మంత్రి మాట్లాడుతూ….భూముల విషయం మీ అంతరాత్మకు తెలుసు అని మాట్లాడుతున్నారని, ప్రజా సమస్యలు ఇక్కడ కాక ఎక్కడ మాట్లాడతారు ? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు రికవరీ చేశారు ? అని ఆయన అన్నారు. గతంలో ఇది 2 లక్షల కోట్ల కుంభకోణం అంటూ ఆరోపణలు చేసారని మహేశ్వర్‌ రెడ్డి వెల్లడించారు.

Air India: ఇజ్రాయిల్-ఇరాన్ టెన్షన్.. టెల్ అవీవ్‌కి విమానాలు నిలిపేసిన ఎయిర్ ఇండియా..

మరి ఎందుకు CBI కి ఇవ్వడం లేదు అని, రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి.. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అని ఆయన అన్నారు. డిసెంబర్ 23న ధరణి పై కమిటీ వేశారు… అది ఎప్పటి వరకు పూర్తి అవుతుందని, సీఎం గా రెండవ రోజే రేవంత్ ధరణి పై రివ్యూ చేస్తే.. న్యాయం జరుగుతుందని రైతులు అభిప్రాయ పడ్డారన్నారు. ఈ పోర్టల్ ను గత ప్రభుత్వం విదేశీ కంపెనీకి అప్పగిస్తే.. ఈ ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు? అని ఆయన వ్యాఖ్యానించారు. ఫారెస్ట్ భూములు, ప్రభుత్వ భూములు తగ్గాయని అంటున్నారని, బీఆర్ఎస్ భూభకాసురులు కాజేశారా? ధరణి పోర్టల్ నిర్వహణను NIC కి ఇచ్చే ఆలోచన ఉందా ? ధరణి పోర్టల్ పై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపిస్తారా ? జరిపిస్తే ఎప్పటిలోగా జరిపిస్తారు? అని మహేశ్వర్‌ రెడ్డి ప్రశ్నలు సంధించారు.

Toofan: చివరి నిముషంలో వెనక్కి తగ్గిన విజయ్ ఆంటోనీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Exit mobile version