NTV Telugu Site icon

Hindu Ekta Yatra : కాషాయమయమైన కరీంనగర్

Hindu Ekta Yatra

Hindu Ekta Yatra

హనుమాన్ జయంతి సందర్భంగా నేడు కరీంనగర్‌లో బీజేపీ హిందూ ఏక్తా యాత్రను నిర్వహించనుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్‌లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా హిందూ ఏక్తా యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అయితే ఈ నేపథ్యంలో.. కరీంనగర్ కాషాయమయంగా మారింది. సాయంత్రం 5 గంటలకు హిందూ ఏక్తా యాత్ర ప్రారంభం కానుంది.

Also Read : Padi Udaynandan Reddy : మనం అభివృద్ది చెందాలంటే విద్య ఒక్కటే మార్గం

కాషాయ జెండాలతో కరీంనగర్ వీధులన్నీ కాషాయ మయంగా మారాయి. కాసేపట్లో బేగంపేట ఎయిర్ పోర్టుకు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ రానున్నారు. అనంతరం హెలికాప్టర్ లో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కరీంనగర్ రానున్నారు. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ ఆవరణలో అస్సాం సీఎంకు బండి సంజయ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం అస్సాం సీఎంతో కలిసి అర్ అండ్ బి గెస్ట్ హౌజ్ కు బండి సంజయ్ వస్తారు. అయితే.. కరీంనగర్ వైశ్య భవన్ నుంచి హిందు ఏక్తా యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రకు లక్ష మంది వస్తారని కాషాయ నేతలు అంచనా వేస్తున్నారు. వైశ్యభవన్ లో జన సందోహాన్ని ఉద్దేశించి హిమంత బిశ్వశర్మ, బండి సంజయ్ కుమార్ ప్రసంగించనున్నారు. ఈ సందర్ంగా బండి సంజయ్ తో కలిసి కొద్దిసేపు ర్యాలీలో హిమంత బిశ్వశర్మ పాల్గొననున్నారు.

Also Read : Adah Sharma: నా నిజాయితీని అపహాస్యం చేశారు.. బెదిరించారు