డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిల పక్షం సమావేశం అయింది. ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరుగుతుంది. కాగా.. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉన్నారు. మరోవైపు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. మీరు పంపిన ఆహ్వానం అందింది.. ఆలస్యంగా అందటంతో తాము పార్టీలో చర్చించే సమయం లేదని పేర్కొన్నారు. ఇలాంటి సమావేశాలు పెట్టాలని అనుకుంటే కాస్త ముందు సమాచారం ఇవ్వండని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం, ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.
Read Also: Ranya Rao: రన్యారావు గాయాలపై డీఆర్‌ఐ కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహిస్తోంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర సమస్యలపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. పార్లమెంట్‌తో పాటు కేంద్రం వద్ద ఆయా అంశాలపై మాట్లాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోంది.
Read Also: NTR Fan : తారక్ అభిమాని మృతి
