ఎంత పెద్ద హీరో అయిన అభిమానుల పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ఎందుకంటే వారు ఆ పొజిషన్ లో ఉన్నారు అంటే కారణం అభిమానులు. అందుకే వారి కోరిక మేరకు హీరోలు ఎంత దూరం అయిన వెళ్తారు. వారి కోసం ఎం అయిన చేస్తారు. ఇలాంటి హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక్కరు. దేశవ్యాప్తంగా తారక్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పకర్లేదు. అభిమానులంటే కూడా తారక్ కు ప్రాణం.. ప్రతి ఆడియో ఫంక్షన్‌లో అభిమానులకు జాగ్రత్త చెప్తూ ఉంటాడు. అయితే కొద్ది రోజుల క్రితం తిరుపతికి చెందిన అతన అభిమాని కౌశిక్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అతని చివరి కోరిక తారక్ తో మాట్లాడటం అనే విషయం తెలుసుకుని, తారక్ వీడియో కాల్ ద్యారా పరామర్శించారు.
Also Read: Kiran Abbavaram : నేను హీరో కాకపోయి ఉంటే రాజకీయాల్లోకి వెళ్లేవాడిని
‘నువ్వు ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నీకోసం నేను కూడా ఆ దేవుని ప్రార్థిస్తూ ఉంటాను. మేమంతా కూడా నువ్వు బాగుండాలి అని కోరుకుంటున్నాం. వీలు చూసుకుని నేను కచ్చితంగా కలుస్తాను, నువ్వు పూర్తిగా కోలుకో కలిసి ఇద్దరం ‘దేవర’ చూద్దాం’ అని తెలిపారు తారక్. అలాగే కౌశిక్ తల్లితో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు. కానీ క్యాన్సర్ తో కౌశిక్ పోరాడలేక పొయ్యాడు. తాజా సమాచారం ప్రకారం నిన్న 11 గంటలకు కౌశిక్ మరణించారు. ఇక విషయం తెలిసిన తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ పోస్టులు పెడుతున్నారు.