Sachin Pilot: రాజస్థాన్‌లోని దౌసాలో ఆదివారం జరగనున్న సచిన్ పైలట్ కార్యక్రమంపై అందరి దృష్టి ఉంది. జూన్ 11న తన తండ్రి దివంగత రాజేష్ పైలట్ వర్ధంతి సందర్భంగా పైలట్ తన భవిష్యత్ కార్యాచరణ గురించి పెద్ద ప్రకటన చేయవచ్చని ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి. పైలట్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరవచ్చని నిపుణులు సూచించారు. మరో వర్గం రాజకీయ విశ్లేషకులు పైలట్ తన సొంత పార్టీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారని, అది రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఆదివారం రాజస్థాన్ రాజకీయాలకు ముఖ్యమైన రోజుగా చెప్పవచ్చు.
Read Also:Kurnool: కర్నూలులో భార్య, అత్తను హతమార్చిన భర్త
పైలట్ కాంగ్రెస్‌ను విడిచిపెట్టడం లేదని చెప్పే మరో నిపుణుల బృందం వాదిస్తోంది. ఆయన పార్టీలో ఉంటూ సరైన సమయం కోసం ఎదురు చూస్తారని అంటున్నారు. కొత్త పార్టీ రిజిస్ర్టేషన్‌కు కూడా పైలట్ ఇంకా దరఖాస్తు చేయకపోవడం వీరి వాదనకు బలం చేకూరుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, రాజస్థాన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (IAS) ప్రవీణ్ కుమార్ గుప్తా, ఎన్నికల సంఘం సాధారణంగా దరఖాస్తు చేసిన 3-4 నెలల తర్వాత మాత్రమే పార్టీని నమోదు చేస్తుందని పేర్కొన్నాడు. ఎన్నికల విశ్లేషకులు కొత్త పార్టీని స్థాపించడానికి రిజిస్ట్రేషన్ తర్వాత కనీసం ఆరు నుంచి పన్నెండు నెలల సమయం పడుతుందని సూచిస్తున్నారు. రాజస్థాన్ ఎన్నికలకు చాలా తక్కువ సమయం మిగిలి ఉన్న ఈ పరిస్థితిలో, పైలట్‌కు కొన్ని నెలల్లో కొత్త పార్టీని స్థాపించడం అంత తేలికైన పని కాదు.
Read Also:Afghanistan Women: దెబ్బతిన్న హస్తకళల మార్కెట్.. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల ఆందోళన
పైలట్‌ను అంత తేలిగ్గా వదులుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ సుముఖంగా కనిపించడం లేదు. పైలట్‌కు చెందిన గుర్జర్ కమ్యూనిటీ రాజస్థాన్‌లోనే కాకుండా ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్‌లలో కూడా అనేక స్థానాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అదనంగా, పైలట్‌కు యువతలో మంచి ఇమేజ్ ఉంది. సీఎం గెహ్లాట్, పైలట్ ఇద్దరినీ కాంగ్రెస్ విలువైన ఆస్తులుగా ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సుఖ్‌జీందర్ సింగ్ రంధావా అభివర్ణించారు.