NTV Telugu Site icon

kodi Pandalu: సై అంటున్న కోడి పుంజులు.. సిద్ధమైన బరులు

Kodi Pandalu

Kodi Pandalu

kodi Pandalu: అధికారులు, పోలీసులు నిర్వహించొద్దని హెచ్చరిస్తున్నా.. రాజకీయ అండదండలతో ప్రతీ ఏడాది సంక్రాంతి సాంప్రదాయం పేరిట కోడి పందాల నిర్వహణ జరుగుతూనే ఉంది.. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి.. కోడి పందాలు చూసేందుకు, పందాలు కాసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. పక్క రాష్ట్రాల వాళ్లు.. అంతెందుకు విదేశాల నుంచి కూడా తరలివస్తున్నారు అంటే.. కోడి పందాలకు ఉన్న క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.. ఇక, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తు్న్నారు.. కోడి పందేలకు జోరుగా ఏర్పాట్లు చేశారు.. బరుల వద్ద పందెరాయుళ్ల కోసం అత్యాధునిక సౌకర్యాలను సైతం ఏర్పాటు చేశారు. పందేలు కాసేవాళ్లను కవ్వించి.. వందల కోట్ల రూపాయల జూదానికి తెర తీసేందుకు పందేంరాయుళ్లకు సమయం వచ్చేసింది.. ఇక, ఎన్నికల ఏడాది కావడంతో.. రాజకీయ నాయకుల తోడ్పాటు కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

Read Also: Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు

ఏపీలో మరీ ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఊరూరా కోడిపందేల బరులను ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందాలతో పాటు గుండాట, కోతముక్క లాంటి జూదాల కోసం కూడా ఏర్పాట్లు సాగుతున్నాయి.. సంక్రాంతి సాంప్రదాయం పేరిట కోడి పందాల నిర్వహణకు సర్వత్రా రంగం సిద్ధం అయ్యింది.. రేపటి నుండి పండుగ మూడు రోజులు.. ఇదే సమయంలో పెద్ద ఎత్తున కోడిపందాలు కొనసాగనున్నాయి.. కోడి పందాలు నిర్వహణకు బరులు సిద్ధం అయ్యాయి.. బరిలో దిగి పోట్లాడేందుకు కోడి పుంజులు సైతం సై అంటున్నాయి.. కోడి పందాలు కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు.. ఎన్నికల ఏడాది కావడంతో కోడి పందాలు జోరుగా సాగుతాయని అంచనా వేస్తున్నారు.. రాజకీయాలకు అతీతంగా ఉమ్మడిగా పలుచోట్ల పెద్ద బరులు ఏర్పాటు చేశారు.. రాత్రులు కూడా కోడి పందాలు నిర్వహణకు శిబిరాల్లో ఫ్లేడ్ లైట్లు ఏర్పాటు చేశారు.

Read Also: Lok Sabha Elections: నేడు ఇండియా కూటమి కీలక సమావేశం

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తు్న్నారు. హైటెక్ హంగులు, ఫ్లడ్‌ లైట్లు, ఎల్ఈడి స్క్రీన్ లతో ముస్తాబు అవుతున్నాయి పందెం బరులు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 100కు పైగా బరులు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం నుంచి భారీ ఎత్తున కోడిపందాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు, కొవ్వూరు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, గోపాలపురం వంటి మండలాల్లో పందాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భీమవరం, పాలకొల్లు, వీరవాసరం, యలమంచిలి, నరసాపురం, ఆచంట, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, పెదవేగి, దెందులూరు, కైకలూరు ఇలా అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి..