kodi Pandalu: సై అంటున్న కోడి పుంజులు.. సిద్ధమైన బరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
kodi Pandalu: అధికారులు, పోలీసులు నిర్వహించొద్దని హెచ్చరిస్తున్నా.. రాజకీయ అండదండలతో ప్రతీ ఏడాది సంక్రాంతి సాంప్రదాయం పేరిట కోడి పందాల నిర్వహణ జరుగుతూనే ఉంది.. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి.. కోడి పందాలు చూసేందుకు, పందాలు కాసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. పక్క రాష్ట్రాల వాళ్లు.. అంతెందుకు విదేశాల నుంచి కూడా తరలివస్తున్నారు అంటే.. కోడి పందాలకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.. ఇక, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తు్న్నారు.. కోడి పందేలకు జోరుగా ఏర్పాట్లు చేశారు.. బరుల వద్ద పందెరాయుళ్ల కోసం అత్యాధునిక సౌకర్యాలను సైతం ఏర్పాటు చేశారు. పందేలు కాసేవాళ్లను కవ్వించి.. వందల కోట్ల రూపాయల జూదానికి తెర తీసేందుకు పందేంరాయుళ్లకు సమయం వచ్చేసింది.. ఇక, ఎన్నికల ఏడాది కావడంతో.. రాజకీయ నాయకుల తోడ్పాటు కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
Read Also: Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఏపీలో మరీ ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఊరూరా కోడిపందేల బరులను ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందాలతో పాటు గుండాట, కోతముక్క లాంటి జూదాల కోసం కూడా ఏర్పాట్లు సాగుతున్నాయి.. సంక్రాంతి సాంప్రదాయం పేరిట కోడి పందాల నిర్వహణకు సర్వత్రా రంగం సిద్ధం అయ్యింది.. రేపటి నుండి పండుగ మూడు రోజులు.. ఇదే సమయంలో పెద్ద ఎత్తున కోడిపందాలు కొనసాగనున్నాయి.. కోడి పందాలు నిర్వహణకు బరులు సిద్ధం అయ్యాయి.. బరిలో దిగి పోట్లాడేందుకు కోడి పుంజులు సైతం సై అంటున్నాయి.. కోడి పందాలు కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు.. ఎన్నికల ఏడాది కావడంతో కోడి పందాలు జోరుగా సాగుతాయని అంచనా వేస్తున్నారు.. రాజకీయాలకు అతీతంగా ఉమ్మడిగా పలుచోట్ల పెద్ద బరులు ఏర్పాటు చేశారు.. రాత్రులు కూడా కోడి పందాలు నిర్వహణకు శిబిరాల్లో ఫ్లేడ్ లైట్లు ఏర్పాటు చేశారు.
Read Also: Lok Sabha Elections: నేడు ఇండియా కూటమి కీలక సమావేశం
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తు్న్నారు. హైటెక్ హంగులు, ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడి స్క్రీన్ లతో ముస్తాబు అవుతున్నాయి పందెం బరులు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 100కు పైగా బరులు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం నుంచి భారీ ఎత్తున కోడిపందాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు, కొవ్వూరు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, గోపాలపురం వంటి మండలాల్లో పందాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భీమవరం, పాలకొల్లు, వీరవాసరం, యలమంచిలి, నరసాపురం, ఆచంట, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, పెదవేగి, దెందులూరు, కైకలూరు ఇలా అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..