Alia Bhatt : అలియా భట్‌కి ఈ సంవత్సరం చాలా స్పెషల్. అలియా ఈ ఏడాది మెట్ గాలాలో అరంగేట్రం చేయనుంది. బాలీవుడ్‌లో ఫిట్, బ్యూటిఫుల్ హీరోయిన్లలో అలియా ఒకరు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టకముందు అలియా చాలా లావుగా ఉండేది. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టగానే కొన్ని కిలోల బరువు తగ్గింది. మళ్లీ ఇటీవల గర్భం సమయంలో బరువుపెరిగింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ చాలా బరువు తగ్గింది. ఆమె తన పర్ఫెక్ట్ ఫిగర్ కోసం ఎప్పుడూ ఎలాంటి డైట్ పాటిస్తుందని ఆమె అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆ సీక్రెట్ తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Also: ACB Raids: ఏపీలో అవినీతి అధికారులపై దాడులు.. లక్షల్లో నగదు స్వాధీనం
అలియా భట్ డైట్ గురించి ప్రత్యేక కథనం..
బరువు తగ్గేందుకు అలియా కీటో డైట్‌ని అనుసరించింది. కీటో డైట్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను బలపరుస్తుంది. ఆకలి స్థాయిలను నియంత్రిస్తుంది. కీటో డైట్ అంటే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ను తొలగించడం. ఒక ఇంటర్వ్యూలో, అలియా కూడా ఫిట్‌గా ఉండటానికి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎంచుకుంటానని చెప్పింది. ఆలియా పోర్షన్ కంట్రోల్‌పై కూడా చాలా శ్రద్ధ చూపుతుంది. టోన్డ్ ఫిగర్ కోసం, అలియా తన ఆహారంలో అధిక ప్రోటీన్, కొన్ని కూరగాయలను తీసుకుంటుంది. ఫిట్‌గా ఉండేందుకు డైట్‌తో పాటు వర్కవుట్‌లపై కూడా అలియా శ్రద్ధ చూపుతుంది. ఫిట్‌గా ఉండేందుకు అలియా సమతుల్య ఆహారం తీసుకుంటుంది.
Read Also: BRS Foundation day: నేడే బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. రాజకీయ తీర్మానాలపై సర్వత్రా ఆసక్తి
ఇలా అలియా డైట్ ఫాలో అవ్వండి
– భారీ భోజనానికి బదులుగా తేలికపాటి భోజనం తినండి.
– మీ ఆహారం అన్ని పోషకాలను కలిగి ఉండాలి.
– ఫిట్‌గా ఉండాలంటే ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండాలి.
– ప్రాసెస్ చేసిన ఆహారాలు, శుద్ధి చేసిన పిండి పదార్థాలకు దూరంగా ఉండండి.
– చక్కెర, ఉప్పు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మానుకోండి.
– మీ ఆహారంలో సీజనల్ కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోండి.
– మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోండి. నీరు ఎక్కువగా తాగాలి.
– తీసుకునే ఆహారంలో ఫైబర్, ప్రోటీన్, పిండి పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండాలి.
– పడుకునే ముందు రాత్రి భోజనం చేయకూడదు.