Alia Bhatt Birthday: బాత్‌రూమ్‌లో నిద్ర.. క్లాస్‌లో బెంచీలు తుడిచిన అలియా భట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bollywood Actress Alia Bhatt Cleans Class Room Benches: 2012లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అలియా భట్.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నారు. తొలి సినిమాలోనే ప్రేక్షకులను మెప్పించిన అలియాకు వరుస ఆఫర్స్ వచ్చాయి. హైవే, 2 స్టేట్స్, కపూర్ అండ్ సన్స్, ఉడ్తా పంజాబ్, రాజి, డియర్ జిందగీ, గల్లీ బాయ్, సడక్ 2 లాంటి హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. ఇక ‘గంగూబాయి కాఠియావాడి’ చిత్రంలో వేశ్యగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న అలియా భట్ పుట్టిన రోజు నేడు. నేటితో అలియా 31 వసంతంలోకి అడుగుపెట్టారు.
ఓ ఇంటర్వ్యూలో అలియా భట్ తన స్కూల్ డేస్ గుర్తుచేసుకున్నారు. తనకు ఎన్నో మరచిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పారు. ‘నేను ముంబైలోని జమ్నాబాయ్ నర్సీ స్కూల్లో చదువుకున్నా. ప్రతిరోజు స్కూలుకి వెళ్లి.. బాత్‌రూమ్‌లో నిద్రపోయేదాన్ని. ఈ విషయాన్ని ఓ టీచర్ గమనించి.. పనిష్మెంట్ ఇచ్చారు. వారం రోజుల పాటు తరగతి గదిలోని బెంచీలను తుడిచాను. ఆ సమయంలో అది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. కానీ ఇప్పుడు తలచుకుంటే మాత్రం చాలా నవ్వొస్తుంది. స్కూల్ రోజుల్లో నాకు అది మరచిపోలేని జ్ఞాపకం’ అని అలియా అన్నారు.
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
Also Read: Dhawal Kulkarni: క్రికెట్‌కు రిటైర్మెంట్.. కన్నీటితో మైదానం వీడిన భారత క్రికెటర్!
‘హీరోయిన్లలో కరీనా కపూర్, కరిష్మా కపూర్ అంటే ఇష్టం. హీరోల్లో షారుక్ ఖాన్, ప్రభాస్ చాలా ఇష్టం.బాహుబలి సినిమాలో ప్రభాస్ నటనకు ఫిదా అయ్యా. ప్రభాస్‌తో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా’ అని ఓ సందర్భంలో అలియా భట్ చెపారు. ఆర్‌ఆర్‌ఆర్‌తో టాలీవుడ్‌లోకి అలియా ఇంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘జిగ్రా’ సినిమాతో బిజీగా ఉన్నారు. సంజయ్ లీలా తెరకెక్కించనున్న ఓ సినిమా, యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో రూపొందనున్న ఓ చిత్రంలో ఆమె నటించనున్నారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న అలియా.. తన మొదటి కూతురు రాహాకు 6 నవంబర్ 2022న జన్మనిచ్చారు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!