Dhawal Kulkarni: క్రికెట్‌కు రిటైర్మెంట్.. కన్నీటితో మైదానం వీడిన భారత క్రికెటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhawal Kulkarni Retirement: టీమిండియా క్రికెటర్ ధావల్ కులకర్ణి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ 2024 ఫైనల్ కులకర్ణికి చివరి మ్యాచ్. తన చివరి మ్యాచ్‌లో విదర్భపై చివరి వికెట్ తీసిన కులకర్ణి.. ముంబై జట్టును విజయతీరాలకు చేర్చాడు. రంజీ ట్రోఫీ ఫైనల్‌లో చివరి విదర్భ వికెట్ తీసిన తర్వాత 35 ఏళ్ల కులకర్ణి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
విదర్భతో జరిగిన ఫైనల్‌లో ధావల్ కులకర్ణి తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ తీశాడు. చివరి మ్యాచ్ ఆడుతున్న కులకర్ణికి.. మ్యాచ్ ముగించాలని ముంబై కెప్టెన్ అజింక్య రహానే బంతిని అందించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఉమేశ్ యాదవ్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అనంతరం కులకర్ణి ఎమోషనల్ అయ్యాడు. ఆటగాళ్లను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ముంబైలోని ప్రతి ఆటగాడు కులకర్ణికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: Shreyas Iyer-BCCI: శ్రేయస్ అయ్యర్‌కు శుభవార్త చెప్పనున్న బీసీసీఐ!
ధావల్ కులకర్ణి తన కెరీర్‌లో 95 ఫస్ట్ క్లాస్, 130 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 281 వికెట్లు, లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 154 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు భారత్ తరఫున కులకర్ణి 12 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు 22 వికెట్లు పడగొట్టాడు. 2014 అరంగేట్రం చేసిన కులకర్ణి.. 2016 తర్వాత అవకాశాలు రాలేదు. ఇక 92 ఐపీఎల్ మ్యాచులలో 86 వికెట్స్ తీశాడు.
𝐕𝐢𝐜𝐭𝐨𝐫𝐲 𝐟𝐨𝐫 𝐌𝐮𝐦𝐛𝐚𝐢!
Dhawal Kulkarni takes the final wicket as they beat Vidarbha by 169 runs in the @IDFCFIRSTBank #RanjiTrophy #Final in Mumbai
Brilliant performance from the Ajinkya Rahane-led side 👌
Scorecard ▶️ https://t.co/k7JhkLhgT5 pic.twitter.com/Iu458SZF2F
— BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..