Alia Bhatt Remuneration: అలియా భట్ రెమ్యునరేషన్, ఆస్తుల విలువ ఏంతో తెలుసా?.. ఆల్‌రౌండర్‌గా దూసుకుపోతుందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alia Bhatt Remuneration and Net Worth: బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ‘అలియా భట్’ ఒకరు. సినిమా నేపథ్యం నుంచి వచ్చిన అలియా.. తన నటనా ప్రతిభతోనే అందరిని ఆకట్టుకున్నారు. 2012లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ తో అరంగేట్రం చేసిన అలియా.. ఒక దశాబ్దం పాటు తన కెరీర్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు. నటనతో పాటు వ్యాపారంలో కూడా ఆమె దూసుకుపోతున్నారు. నేడు అలియా భట్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె రెమ్యునరేషన్, నికర ఆస్తుల విలువ గురించి ఓసారి తెలుసుకుందాం.
1993 మార్చి 15న ముంబైలో అలియా భట్ జన్మించారు. ఆమె ప్రముఖ దర్శకులు మహేశ్ భట్-సోనీ రజ్దాన్ దంపతుల కుమార్తె. అలియా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా సినిమాల్లో నటించారు. 1999లో అక్షయ్ కుమార్, ప్రీతి జింటాల కాంబోలో వచ్చిన ‘సంఘర్ష్’లో తొలిసారిగా నటించారు. ఈ చిత్రంలో ఆమె ప్రీతి చిన్ననాటి పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో అలియా పాత్ర చిన్నదే అయినా తనదైన ముద్ర వేశారు. పేరెంట్స్ పేరు వాడుకోకుండా స్వతహాగా సినిమాల్లో రావాలనుకున్న అలియా.. సినిమా ఆఫర్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగారు. చివరకు 2012లో కరణ్ జోహార్ అవకాశం ఇవ్వడంతో హీరోయిన్ అయ్యారు.
Also Read
- Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
- WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
12 ఏళ్ల కెరీర్లో అలియా భట్ ఎన్నో విజయాలు అందుకున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న అలియా.. ఒక్కో చిత్రానికి దాదాపు రూ.10-12 కోట్లు వసూలు చేస్తారట. హాలీవుడ్ మూవీ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ కోసం $500,000 ఛార్జ్ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. నటనతో పాటు ఆమె నిర్మాత కూడా మారారు. 2021లో ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌ని ప్రారంభించారు. 2022లో ఆమె మొదటి సినిమా ‘డార్లింగ్స్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ‘పోచర్’ వెబ్‌సిరీస్ ఇటీవల ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో విడుదలైంది.
Also Read: Alia Bhatt Birthday: బాత్రూమ్లో నిద్ర.. క్లాస్‌లో బెంచీలు తుడిచిన అలియా భట్!
అలియా భట్ వచ్చే సెప్టెంబర్‌లో ‘జిగ్రా’ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్‌తో కలిసి ఆమె నిర్మిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. అలియా మొత్తం నికర ఆస్తుల విలువ రూ.550 కోట్ల కంటే ఎక్కువ. కిడ్ అండ్ మెటర్నిటీ వేర్ బ్రాండ్ ‘ఎడ్-ఎ-మమ్మ’ను అక్టోబర్ 2020లో ఆమె ప్రారంభించారు. 2023లో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీలో 51 శాతం వాటాను కొనుగోలు చేశారు. ఫూల్.కో, స్టైల్ క్రాకర్, సూపర్ బాటమ్స్ వంటి అనేక బ్రాండ్లలో కూడా పెట్టుబడులు పెట్టారు. మొత్తానికి అలియా ఆల్‌రౌండర్‌గా దూసుకుపోతున్నారు. ముంబైలోని బాంద్రాలో సుమారు రూ. 32 కోట్ల విలువైన బంగ్లా, లండన్‌లో రూ.25 కోట్ల విలువైన ఇల్లు కూడా ఉంది. అలియా వద్ద రూ.1.76 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ 7 సిరీస్, రూ.2 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!