IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హెడ్ కోచ్ పదవికి స్టీఫన్ ఫ్లెమింగ్ రాజీనామా చేశారు. ఆయన సిఎస్కేకి చెందిన ఇతర ఫ్రాంచైజీలైన సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) లోని ‘జోబర్గ్ సూపర్ కింగ్స్’ (JSK), మేజర్ లీగ్ క్రికెట్ (MLC) లోని ‘టెక్సాస్ సూపర్ కింగ్స్’ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో జోబర్గ్ సూపర్ కింగ్స్ తమ కొత్త హెడ్ కోచ్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత భారీ సిక్స్ బాదిన సౌతాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ అల్బీ మోర్కెల్‌ను జోబర్గ్ సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా నియమించారు.
సూపర్ కింగ్స్ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం ఉన్న అల్బీ మోర్కెల్, జట్టుకు మొదటి SA20 టైటిల్ అందించే లక్ష్యంతో ఈ కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు. గత నాలుగు సీజన్లుగా కోచ్‌గా వ్యవహరించిన ఫ్లెమింగ్ నేతృత్వంలో ఐపిఎల్‌లో మంచి విజయాలు సాధించినప్పటికీ, SA20 లీగ్‌లో మాత్రం జోబర్గ్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అల్బీ మోర్కెల్ 2008 ఐపిఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ ఏకంగా 125 మీటర్ల భారీ సిక్సర్ బాది రికార్డు సృష్టించారు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత ఆయన కోచింగ్ వైపు అడుగులు వేశారు. గతంలో సిఎస్కే ఫ్రాంచైజీలలో వివిధ హోదాల్లో పనిచేసినప్పటికీ, ఒక జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఆయనకు ఇదే తొలిసారి. అంతేకాకుండా, భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కూడా మోర్కెల్ భాగమయ్యారు.
Also Read
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
100కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవం ఉన్న అల్బీ మోర్కెల్‌పై JSK డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. మోర్కెల్‌కు ఆటగాడిగా, కోచ్‌గా తమ ఫ్రాంచైజీ సంస్కృతి బాగా తెలుసని, సౌతాఫ్రికా క్రికెట్ పరిస్థితులపై ఆయనకున్న అవగాహన జట్టుకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. SA20 తదుపరి ఎడిషన్ జనవరి 17, 2027న ప్రారంభం కానుండగా, జోబర్గ్ సూపర్ కింగ్స్ జనవరి 18న పార్ల్ రాయల్స్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. ఐపిఎల్ ప్రారంభానికి ముందే మోర్కెల్ హెడ్ కోచ్‌గా తన ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!