NTV Telugu Site icon

Alapati Raja: తెనాలి సీటు ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం అధినాయకత్వంకి వదిలి వేశాం..

Alapati Raja

Alapati Raja

Alapati Raja: గుంటూరు జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య పొత్తుల వ్యవహారం క్షేత్రస్థాయిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుని కలిసిపోయామని చెప్పిన నాయకులు.. ఇప్పుడు ఎవరికి వారే ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటున్నారు. సీటు తమకే వస్తుందని జనసేన-టీడీపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజాలు సీటు కోసం పోటీపడుతున్నారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది.

Read Also: Geethanjali Malli Vachindi : గీతాంజలి సీక్వల్ క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉంటుందంటూ ఆసక్తికర కామెంట్స్ చేసిన అంజలి..

మరోవైపు ఈ అంశంపై మాజీ మంత్రి ఆలపాటి రాజా స్పందిస్తూ.. తెనాలి సీటు ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం అధినాయకత్వంకి వదిలి వేశామన్నారు. సీటుపై నిర్ణయం చంద్రబాబు, పవన్ కలిసి నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇద్దరం కూడా సీటు ఎవరికో చెప్పలేదని పేర్కొన్నారు. అధినేతలు నిర్ణయం ఏం తీసుకున్నా ఇద్దరం కలిసి పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. జనసేన – టీడీపీ పొత్తు ఖాయమైంది.. కాబట్టి నియోజకవర్గంలో కలిసి పనిచేయాలి, చేస్తున్నామని ఆలపాటి రాజా అన్నారు. తాను పాదయాత్ర చేసినా, జనసేన కార్యక్రమం చేసినా.. రెండు కూడా రెండు పార్టీల కోసమేనన్నారు. కాగా.. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి పాదయాత్ర చేస్తున్నట్లు ఆలపాటి రాజా తెలిపారు.

Read Also: The Kerala Story: రాష్ట్రాన్ని గడగడలాడించిన సినిమా.. ఎట్టకేలకు ఓటిటీకి..?