NTV Telugu Site icon

Akshay Kumar: అయోధ్యలోని కోతుల ఆహారం కోసం బాలివుడ్ యాక్టర్ భారీ విరాళం..

Akshay

Akshay

అక్షయ్ కుమార్ గొప్ప నటుడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి అని అందరికీ తెలుసు. అతను ఎల్లప్పుడూ అవసరమైన వారికి సహాయం చేస్తుంటాడు. తాజాగా నటుడు మరోసారి కొన్ని గొప్ప మనసు చాటుకున్నాడు. అయోధ్యలో ప్రతిరోజూ కోతులకు ఆహారం ఇవ్వాలని అక్షయ్ నిర్ణయించుకున్నాడు. కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. దీంతో మనుషులపైనే కాదు.. జంతువులకు పట్ల కూడా తన మంచి మనసును మరోసారి నిరూపించుకున్నాడు. శ్రీరాముడి ఆశీస్సులు పొందేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నాడు.

READ MORE: Bangalore:12 ఏళ్లు బెంగళూరులో బంగ్లాదేశ్‌ వాసి.. పోలీసులకు పట్టించిన మొదటి భార్య

ఆంజనేయ సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న జగత్గురు స్వామి రాఘవాచార్య జీ మహారాజ్ మార్గదర్శకత్వంలో అక్షయ్ ఈ చొరవ తీసుకుంటున్నాడు. ట్రస్ట్‌లోని వ్యక్తులు అక్షయ్‌ను సంప్రదించినప్పుడు.. అతడు వెంటనే విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ప్రియా గుప్తా, అక్షయ్‌ను ప్రశంసించారు. నటుడు తన కుటుంబానికి, సహోద్యోగులకు సహాయం చేయడంలో మాత్రమే కాకుండా సమాజానికి సేవ చేసేందుకు కూడా ముందుంటాడని కొనియాడారు.

READ MORE: Bangalore:12 ఏళ్లు బెంగళూరులో బంగ్లాదేశ్‌ వాసి.. పోలీసులకు పట్టించిన మొదటి భార్య

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అక్షయ్ తన తదుపరి చిత్రం సింగం ఎగైన్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రంలో అక్షయ్ ప్రధాన పాత్రలో లేకపోయినా, సినిమాలో అతని పాత్రకు ప్రాధాన్యత ఉండబోతోందని అంచనా. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. రణవీర్ సింగ్, దీపికా పదుకొణె, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.