Site icon NTV Telugu

AKKI : హిట్టిచ్చిన హీరోయిన్స్ ను రిపీట్ చేస్తున్న అక్షయ్ కుమార్.. కలిసొచ్చేనా?

Akshay Kumar

Akshay Kumar

అక్షయ్ కుమార్ దర్శకులనే కాదు హీరోయిన్స్‌ను కూడా అప్పుడప్పుడు రిపీట్ చేస్తుంటాడు. 25 ఏళ్ల తర్వాత టబుతో కలిసి నటిస్తున్న ఖిలాడీ హీరో.. నెక్ట్స్ మరో బ్యూటీని రిపీట్ చేయబోతున్నాడు. ఇప్పటి వరకు ఆ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ హిట్స్ కావడంతో సెంటిమెంట్‌గా చూస్తున్నాడు అక్షయ్ కుమార్. తన అప్ కమింగ్ సినిమాల్లో ఇద్దరు సీనియర్ భామల్ని రిపీట్ చేస్తున్నాడు. భూత్ బంగ్లాలో టబుతో కలిసి నటిస్తున్నాడు. 25 ఏళ్ల తర్వాత ఈ జోడీ జతకట్టబోతోంది. 2000లో వచ్చిన హేరా పేరీ తర్వాత ఈ పెయిర్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది. హేరా పేరీతో ఈ జోడీని ఒక్కటి చేసిన ప్రియదర్శనే భూత్ బంగ్లాకు దర్శకుడు.

Also Read : Spirit FirstLook : స్పిరిట్ ఫస్ట్ లుక్ అరాచకమే.. కానీ అదే మైనస్

సరైన హిట్స్ లేక స్ట్రగుల్ చూస్తున్న అక్షయ్.. మరోసారి తనకు అచ్చొచ్చిన భామ విద్యాబాలన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. భూల్ బూలయ్యా3 ఫేం అనీజ్ బజ్మీ దర్శకత్వంలో ఓ మూవీ ఫిక్స్ అయ్యిందట. జనవరి 15 నుండి సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. గతంలో విద్యాతో భూల్ భులయ్యా, హే బేబీ, మిషన్ మంగళ్‌లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఖిలాడీ హీరో. అనీజ్- అక్షయ్ కాంబోలో వచ్చిన థాంక్యూలో విద్య గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. ఇవన్నీ హిట్స్ కొట్టడం హీరో, దర్శకుడు సెంటిమెంట్‌గా ఆమెను పట్టుకురాబోతున్నారని బాలీవుడ్ బజ్. ఇదే నిజమేతే ఏడేళ్ల తర్వాత ఈ పెయిర్ ఎంటర్టైన్ చేయబోతోందన్న మాట. మరి ఈ హిట్ పేయర్స్ తో అక్కి ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

Exit mobile version