Samantha: ఏమాయ చేశావె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టాలెంటెడ్ హీరోయిన్ సమంత. సామ్ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొంది ఈ బొమ్మ. ఇటీవల సమంత అనారోగ్యంతో బాధపడుతుంది అంటూ వస్తున్న వార్తలు ఖండిస్తూ వచ్చారు ఆమె సన్నిహితులు. కానీ ఇన్ స్టా వేదికగా.. తను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత ప్రకటించింది. ఆ ప్రకటన చూసిన ఆమె అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.
Read Also: Loan App Harashment: ఆగని లోన్ యాప్ వేధింపులు.. భర్త చనిపోవడంతో భార్యకు ఫోన్ చేసి..
దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సెలబ్రెటీలు పోస్టులు పెడుతున్నారు. కియారా అద్వానీ నుంచి ఎన్టీఆర్ వరకు అందరూ ఆమెకు దైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రియా, రాశిఖన్నా, సుస్మిత కొణిదెల స్పందిస్తూ.. త్వరగా కోలుకో.. ఎప్పటిలాగే ధైర్యంగా ఉండాలంటూ కోరారు. తాజాగా సమంత ఆరోగ్యంపై అక్కినేని అఖిల్ స్పందించారు. ‘అందరి ప్రేమాభిమానాలే నీకు బలాన్ని ఇస్తాయి.. డియర్ సామ్’ అంటూ అఖిల్ పోస్ట్ చేశాడు. కాగా, గత ఏడాది సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. కాగా దీనిపై చైతన్య స్పందిస్తాడా లేదా అని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. చైతన్య కూడా స్పందించాలి అంటూ నెటిజెన్లు కోరుతున్నారు. మరి చూడాలి నాగచైతన్య రియాక్ట్ అవుతాడో లేదో. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తోంది. అలాగే.. ఆమె నటించిన యశోద చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది.