NTV Telugu Site icon

Akira Nandan : అకీరా నందన్ గడ్డం పై సోషల్ మీడియాలో డిబేట్.. అసలు అది నిజమేనా ?

New Project (94)

New Project (94)

Akira Nandan : ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ డెబ్యూ ఏదైనా ఉందంటే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నాపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ డెబ్యూనే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా తండ్రిని ఫాలో అయ్యేందుకు రెడీ అవుతుననాడు. అతని సినీ ఎంట్రీ గురించి అధికారిక ప్రకటనలు ఇంకా రాకపోయినప్పటికీ పబ్లిక్ వేదికలపై అకీరా ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తూ తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల అకీరా నందన్ గుబురు గడ్డంతో స్టైలిష్ అవతార్‌లో కనిపించి, అభిమానులందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ కొత్త లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఆరున్నర అడుగుల బుల్లెట్టు కావడం, ఒడ్డు పొడుగు, ఛామింగ్ అప్పియరెన్స్‌ను కలిగి, ఇప్పటికే అకీరాకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.

Read Also:Kanchi Kamakshi: కాంచీపురం అమ్మవారికి బంగారు వీణ

అకీరా తన తండ్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి ఇటీవల కేరళ, తమిళనాడు ప్రాంతాలలో ఆలయాల పర్యటన చేసాడు. వీరిద్దరూ తిరువనంతపురం సమీపంలోని శ్రీ పరశురామ ఆలయాన్ని సందర్శించారు. అక్కడి నుంచి విడుదలైన ఫోటోలలో అకీరా నందన్ నల్ల గుబురు గడ్డంతో కనిపించి, తన అభిమానులను ఆశ్చర్యపరచాడు. ఈ కొత్త లుక్‌తో అకీరా నందన్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. ఇది అకీరా డెబ్యూ సినిమాకు సంబంధించిన ఊహాగానాలకు మళ్లీ ఊతం ఇచ్చింది. కొంతమంది అభిమానులు అతను డెబ్యూ సినిమాకు సిద్దమయ్యాడా అనే ప్రశ్న కూడా అడుగుతున్నారు. “ఇంకా వయస్సు తక్కువే, కానీ ఫుల్ గడ్డం ఎలా పెంచాడు?” అని సోష‌ల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Read Also:Masthan Sai : రెండో రోజు కొనసాగుతున్న మస్తాన్ సాయి కస్టడీ..

పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరా నందన్ ను అతి త్వరలో తన సినీ కెరీర్‌ ప్రారంభం చేసే విషయంపై అంచనాలు పెంచుకున్నారు. ప్రభాస్, రానా, వ‌రుణ్ తేజ్ తదితరుల తర్వాత అకీరా నందన్ మరో టాలీవుడ్ హీరోగా ఎదుగుతున్నట్లుగా భావిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి అకీరా ఎంట్రీ ఎప్పుడైనా ప్రకటించబడే అవకాశం ఉందని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు.